ఒక మునిసిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు పార్టీలో చేరినంత మాత్రాన వారిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీలో చేర్చుకోవాలా? అని ఎవ్వరికైనా సందేహం కలుగుతుంది. లోకల్ ఎమ్మెల్యే సమక్షంలో వారు కండువాలు కప్పించుకుంటే చాలు కదా.. అని కూడా అనిపిస్తుంది. కానీ కడప మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన ఏడుగురు కార్పొరేటర్లకు ఆ అవకాశం దక్కింది. వారు వెళ్లి చంద్రబాబు సమక్షంలోనే పార్టీలో చేరారు. వారికి ఎందుకంత అగ్రప్రాధాన్యం ఇచ్చినట్టు అనే సందేహం చాలా మందికి కలిగింది.
కడప స్థానిక నాయకులు విపరీతంగా కష్టపడి ప్రలోభపెట్టినా సరే.. కేవలం ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లను మాత్రమే తెదేపాలో చేరడానికి ఒప్పించారు. అంతమాత్రాన వారికి అక్కడ కార్పొరేషన్ దక్కే అవకాశమే లేదు. కానీ.. ఇంత కష్టపడి వారికి ప్రయారిటీ ఇచ్చినందుకు ఆశించిన ఫలితం మాత్రం ఇవాళ నెరవేరింది. ఇవాళ కడప కార్పొరేషన్ సమావేశం మొత్తం రచ్చరచ్చ అయిపోయింది.
గతంలో కార్పొరేషన్ సమావేశం జరిగినప్పుడు ఎమ్మెల్యే మాధవీరెడ్డి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. సమావేశంలో మేయర్ కుర్చీ పక్కనే తనకు కూడా కుర్చీ వేయాల్సిందే అని మాధవీ రెడ్డి పట్టుపట్టారు. అయితే మేయర్ సురేష్ బాబు అందుకు ఒప్పుకోలేదు. ఎమ్మెల్యే కూడా కార్పొరేటర్లు అందరితో పాటు మాత్రమే కూర్చోవాలన్నట్టుగా వ్యవహరించారు. దీంతో మాధవీరెడ్డి పట్టువీడలేదు. ఆమె ఆరోజు పూర్తిగా నిల్చునే మాట్లాడుతూ తన నిరసన తెలియజేశారు. అయితే ఆ సమావేశంలో ఆమెకు మద్దతుగా నిలవడానికి వెంట ఎవ్వరూ లేరు. కడప కార్పొరేషన్ మొత్తం వైసీపీ మయం కావడం వల్ల.. మాధవీరెడ్డి ఆరోజున ఒంటరిపోరాటం చేశారు.
అప్పటినుంచి ఆమె పావులు కదిపారు. ఏడుగురు కార్పొరేటర్లను చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేర్చారు. దాని ద్వారా ఆశించిన ఏకైక ప్రయోజనం.. కార్పొరేషన్ సమావేశంలో మళ్లీ రచ్చ చేయడానికి తనకు కొంతమంది మద్దతు కూడగట్టుకోవడమే అన్నట్టుగా కనిపిస్తోంది.
సోమవారం నాటి సమావేశంలో కూడా మేయర్ పక్కన తనకు కుర్చీ వేయాల్సిందే అని ఎమ్మెల్యే మాధవీరెడ్డి గొడవ చేశారు. గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు చెరోపక్క కుర్చీ వేయించి కూర్చోబెట్టుకున్నారని కూడా అన్నారు. అదేమీ సాంప్రదాయం కాదని, కుర్చీవేయాల్సిన అవసరం లేదని మేయర్ తిరస్కరించడంతో రచ్చకు దిగారు. ఈసారి ఆమె వెంట ఫిరాయించిన తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్నారు. దాంతో రచ్చ బాగా ముదిరి పెద్దదైంది.
వైసీపీ, తెదేపా వర్గాల కార్పొరేటర్ల తోపులాటలు, దూషణలు అనేకం జరిగాయి. తెదేపా కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్టు మేయర్ సురేష్ బాబు ప్రకటించగా, వైసీపీవారిని కూడా సస్పెండ్ చేయాలంటూ మాధవీరెడ్డి మరో రచ్చకు దిగారు. ఇలా సమావేశంలో రచ్చ చేయడానికి మద్దతే ఆమె లక్ష్యం అన్నట్టుగా ఆ ఫిరాయింపులు జరిగాయేమో అనిపిస్తోంది.
Cbn national party pettalni try chesadu kcr ki dikku ledhu veedni yevaru pattinchukuntaru
ఆరాయ్ పెండ్యాల కిషోర్ రెడ్డి , 11 రెడ్డి నేషనల్ పార్టీ ఎం అయందిరా? సీబీఎన్ గురించి నీకెందుకు ముందు 11 పార్టీ ప్లాన్స్ ఏంటి?
Oh, is he cheddi too?
Is he che ddi too? No wonder he seems to be first comment…maybe paytm
So true Bhayyaa. Kamma party can only survive in Andhra