అల్లుఅర్జున్ మామకు కాంగ్రెస్ అధిష్టానం నో!

అల్లుఅర్జున్ తరఫున కాంగ్రెస్ అధిష్టానం ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని ఆయ‌న చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే తెలుస్తోంది.

సంధ్య థియేటర్ ఘటనలో అల్లుఅర్జున్‌ను బాధ్యుడిగా చేసే ప్రయత్నాల్లో తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతుండగా, ఆయన మామ, కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం దక్కలేదని సమాచారం. అందులో భాగంగా ఈ రోజు గాంధీభవన్‌కు వెళ్లిన‌ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ, మున్షీ ఆయనతో మాట్లాడకుండానే బయటికి పంపించారని తెలుస్తోంది.

గాంధీభవన్ నుంచి బయటకు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడకుండానే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. అల్లుఅర్జున్ బెయిల్ రద్దు కోసం ప్రభుత్వ తరఫున కోర్టులో పిటిషన్ వేయాలనే ఆలోచన ఉందని వస్తున్న వార్తలు వ‌స్తున్న నేపథ్యంలో, అల్లుఅర్జున్ తరఫున కాంగ్రెస్ అధిష్టానం ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని ఆయ‌న చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే తెలుస్తోంది.

మ‌రోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అల్లుఅర్జున్‌కు మద్దతుగా మాట్లాడుతుండ‌టంతో, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ వివాదం కాస్తా రాజకీయ రంగు పులమడంతో అల్లుఅర్జున్‌ను మరిన్ని కష్టాల్లోకి నెడుతోంది.

3 Replies to “అల్లుఅర్జున్ మామకు కాంగ్రెస్ అధిష్టానం నో!”

Comments are closed.