అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

అల్లు అర్జున్ – కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిలా తయారైంది పరిస్ధితి.

అల్లు అర్జున్ – కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిలా తయారైంది పరిస్ధితి. మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన మొత్తాన్ని, అక్కడ అల్లు అర్జున్ ‘తప్పు’ చేశాడంటూ పూసగుచ్చినట్లు చెప్పడం, ఆ తర్వాత వరుసగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం చకచకా జరిగిపోయాయి.

నిన్నటికినిన్న బన్నీ తప్పేం లేదేమో అనుకున్నవాళ్లు కూడా వీడియోలు చూసిన తర్వాత తమ అభిప్రాయం మార్చుకున్నారు. ఇక పోలీసులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ అల్లు అర్జున్ పై రివర్స్ అయ్యేసరికి ఇప్పుడు రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా తయారయ్యాడు అల్లు అర్జున్.

దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘అద్దాల మేడ’ అనే సినిమా ఉంది. సినిమా వాళ్ల గురించి, వాళ్ల జీవితాల గురించి దాసరి చాలా అద్భుతంగా చెప్పారీ సినిమాలో. తామంతా అద్దాల మేడల్లో కన్పించే బొమ్మలమని, చూడ్డానికి అందంగా కన్పించినా… ఎవరు రాయి విసిరినా తమ జీవితం అద్దంలా పగిలిపోతుందని చెప్పారు. అందుకే తాము జాగ్రత్తగా ఉంటామని, వివాదాలకు దూరంగా ఉంటామని చెప్పుకొచ్చారు.

కానీ ఇక్కడ అల్లు అర్జున్ వ్యవహార శైలి పూర్తిగా భిన్నంగా ఉంది. సినిమాల్లో ఉన్నంతవరకే హీరోలు, నటులు. బయటకు వచ్చాక వాళ్లు కూడా అందరితో సమానమే. కాదు, కాకూడదు మేం వేరే, మా బ్లడ్ వేరే అంటే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది.

నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ ఇష్యూ ఇంతదూరం వచ్చేది లేదు. కానీ బన్నీ మాత్రం… ఎవడ్రా మనల్ని ఆపేది టైపులో ఉండడం వల్లే పరిస్ధితి ఇంతవరకు వచ్చిందంటున్నారు చాలామంది. సినిమా హీరోలంటే డెమీ గాడ్స్ అని ఇండస్ట్రీలో చాలామంది నమ్ముతారు. దానికి కారణం ప్రేక్షకులు కాదు… సదరు హీరోల పక్కనున్న భజనగాళ్లు. బాబు.. బాబు.. అని పొగిడితే… ఉబ్బితబ్బిబ్బైపోతారు హీరోలు.

కానీ వాస్తవ పరిస్థితి వేరే ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా ప్రభుత్వం ముందు, చట్టాల ముందు చిన్నవాడే. ఈ విషయం బన్నీకి తెలియంది కాదు, కానీ ఆయన ఇరుక్కుపోయాడు. డైరెక్ట్ గా అధికార పార్టీతోనే కయ్యం పెట్టుకున్నట్టయింది. చివరికి అతడు వేసుకున్న ఐకాన్ స్టార్ అంటూ ముద్రించిన షర్ట్ ను కూడా కొందరు విమర్శిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. వ్యవహారాన్ని ఇండస్ట్రీ పెద్దల సహకారంతో సద్దుమణిగేలా చేసుకోవడం బెటర్. తానేదో ఇండియా మొత్తానికి హీరో అనే ఇమేజ్ నుంచి బన్నీ బయటకు రావాలి. బాలయ్య అన్ స్టాపబుల్ లో కూడా అల్లు అర్జున్ ఒక మాట అన్నాడు. పరిస్థితులను బట్టి కాకుండా మూర్ఖంగా వెళ్లేవాడే సక్సెస్ అవుతాడని, తాను కూడా అలాగే ఉంటానని చెప్పుకొచ్చాడు. కానీ ఈ కామెంట్ సినిమాల్లో బావుంటుందేమో కానీ బయట వర్కవుట్ కాదు.

ఎందుకంటే… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కంటే రెండాకులు ఎక్కువ చదివినవాడే. కాబట్టి… ఇప్పటికైనా బన్నీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అసలు ఇప్పటివరకు ఏం జరిగిందో, ఈ వివాదం ఎలా మలుపులు తీసుకుంటోంది, ఇది తన కెరీర్ ను ఎంత డ్యామేజ్ చేసిందో ఓసారి ఆలోచిస్తే బన్నీకి పరిస్థితి పూర్తిగా అర్థమౌతుంది.

ఈ వివాదంలో బన్నీ ప్రమేయం ఉందా లేదా అనేది ఇక్కడ చర్చించడం లేదు. ఆయన తప్పు చేశాడా లేదా అనేది కూడా కోర్టు తేలుస్తుంది. ఎటొచ్చి తను అద్దాల మేడలో ఉన్నాననే విషయాన్ని బన్నీ గుర్తిస్తే చాలు.

36 Replies to “అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు”

  1. ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసిన తరువాత కూడా మూవీ చూస్తూ ఉండటం..తిరిగి వెళ్ళేటప్పుడు కార్ లో నుండి బయటికి వచ్చి చేతులు వూపటం అంటే బన్నీ State of మైండ్ ఏంటో తేడా గా వుంది.

  2. “పుష్పా అంటే రేవంత్ నలిపిన “ఫ్లవరు” అనిపించుకుంటాడా??

    లేక

    “నీయవ్వ తగ్గేదేలే” అంటూ

    “WILD FIRE” అని నిరూపించుకుంటాడా??..

  3. Bunny నీకు ఒక దేశానికి ఉన్నట్టు, ఏకంగా నీకు ఆర్మీ నే ఉంది కదా

    +..

    A1 సింహం and రకుల్ రావు మన పక్కే..

    So

    నీ ఆటిట్యూడ్ ఏమాత్రం తగ్గొద్దు రా బన్నీ

    నిన్ను “పుష్ పా” అనుకుంటున్నారు.. కాదు “WILD FIRE” అని నిరూపించు రా ద’మ్ముంటే..

  4. నాకెందుకో బన్నీ గాడు, తన ఆర్మీ తో సీఎం పై యుద్ధం చేస్తాడేమో అని భయంగా ఉంది.. ఎవరు గెలుస్తారో ఎం అవుతుందో ఏమో??

  5. పుష్ప అంటే “RR నలిపేసిన ప్లవరు” అంటున్నారు బన్నీ.. కాదంటే ఏదీ ఓసారి “నీయవ్వ తగ్గేదే లే” WILD FIRE ఆనవా ప్లీజ్ ప్లీజ్

  6. పుష్ప అంటే “RR నలిపేసిన ప్లవరు” అంటున్నారు బన్నీ.. కాదంటే ఏదీ ఓసారి “నీయవ్వ తగ్గేదే లే” WILD FIRE నిరూపించవా.. ప్లీజ్ ప్లీజ్ bunny

  7. వైస్సార్ సీపీ నీడ పడితే ఎంత వాడైనా మాడి మసి అవ్వాల్సిందే . అది అఖిల భారత సర్వీస్ అధికారులు అయినా, రాజకీయ నాయకులూ అయినా, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే . ఇక అల్లు అర్జున్ ఒక లెక్కా . poor boy అర్జున్ తెలుసుకోలేకపోయాడు.

  8. టికెట్ రేట్లు పెంచుకోవడానికి and బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు డ్రామా దె0గితే మండదా అధ్యక్షా??

    ఆ డ్రామా కి, ఆ పొగరు ఆటిట్యూడ్ కి తగిన మూల్యం టోటల్ టాలీవుడ్ చెల్లించాల్సిందే

  9. bunny ban gaya sunny.. pogaru taggichukunte neeku manchidhi taggedhe le kadhu taggali taggi teerali PK la ekkada taggalo telisthey deputy cm ayyadu nv kannesam oka god actor ani anipinchukuntav neeku elagu viswasam ledhu kani..aa mukku ki 32 kutlu operations chesi untaru ra chudaleka chastunnam nv ne OA

  10. అతడి మీద అంత అక్కరతో హితవు చెప్పడం దేనికి? చాలా నిబంధనలను అతిక్రమించాడు. కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. మానవత్వం కూడా లేదు. అతడికి షాక్ష పడాల్సిందే!

    1. పుష్కరాల ఘటన తరువాత ఐదేళ్లు అధికారం లో ఉన్నవాళ్లు ఏమి చేసారు మాస్టారు .. ఏమైనా అధరాలు సేకరించి కేసు వేసారా ?

  11. Police la investigation, Court la teerpu telusthaayi AA dosha? nirdosha? ani. Ayina aa siggumaalina parugulu yevito janaalu, AA vostunaadani? Yedho varadhalu, yudha karuvu pranthallo thindi packet la kosam helicopter nundi giratavesthe, parugethinattu. Ithara deshallo yudhala moolamgano, bookampam vosthe prajalu kolpatharu, mari adhi yento yevado cinema star leka rajakeeya nayakudu vosthe thokkislaatallo prajalu potunnayi. Thoo, manam asalu maramaa? Aa thokkeeslatala chesina janalanu kadha modata bokkalo vesi viragottali?

  12. సినిమా హీరో గారు తన ఆదాయంలో 10% ఆ కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబానికి రక్షణగా బాధ్యతగా ఉండాలని మా డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నాము

  13. అంటే ఈ విషయంలో జగన్ ఏమి చెయ్యలేడు అంటావా గ్యాస్ వెంకీ ..! మరి ఇంతాడానికి అంత పెద్ద ట్విట్ ఎందుకేసాడు అంటావ్ ?

Comments are closed.