తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేటలో వుంటున్న మంచు మోహన్‌బాబు వద్దకు ఆయన చిన్న కుమారుడు మనోజ్ వెళ్తున్నారనే ప్రచారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ మధ్య మంచు కుటుంబంలో విభేదాలు వీధికెక్కిన సంగతి తెలిసిందే. మంచు మోహన్‌బాబు దంపతులు, పెద్ద కుమారుడు విష్ణు ఒకవైపు, చిన్న కుమారుడు మనోజ్ ఒక్కడు ఒకవైపు నిలిచి, గొడవలు పడుతున్న సంగతి తెలిసిందే.
మనోజ్ గురించి మోహన్‌బాబు వీడియో కూడా విడుదల చేశారు. అలాగే తన అన్న విష్ణు, అతని అనుచరులు తనను హత్య చేయడానికి ప్రయత్నించారంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే మనోజ్ చెప్పినదాంట్లో నిజం లేదని అతని తల్లి పోలీసులకు మరో లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో మంచు మోహన్‌బాబు, విష్ణు కలిసి రంగంపేటలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అయితే తండ్రి వద్దకు మనోజ్ వెళ్తున్నట్టు మీడియాకు అతని సన్నిహితులు సమాచారం ఇచ్చారు. మోహన్‌బాబు ఆహ్వానం మేరకు మనోజ్ వెళ్తున్నాడా? లేక తనకు తానుగా కుటుంబ సభ్యులతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని భావిస్తున్నాడా? అనే చర్చకు తెరలేచింది.
ఒకవేళ మోహన్‌బాబుకు ఇష్టం లేకుండా మనోజ్ వెళితే, ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కూడా లేకపోలేదు. మొత్తానికి మనోజ్ తిరుపతికి రాకపై అందరి దృష్టి నిలిచింది.
“తిరుపతి సెట్టింగ్” ఏసుకుని పండగ చేసుకోవచ్చు కదా
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది,తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, eidhu💋