కేటీఆర్ కేసుపై ఉత్కంఠ‌

స‌ర్వోన్న‌త న్యాయ స్థానంలో కేటీఆర్‌కు ఉప‌శ‌మ‌నం దొర‌క్క‌పోతే, అరెస్ట్ త‌ప్ప‌క పోవ‌చ్చ‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

ఫార్ములా ఈ-కారు రేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏమ‌వుతుందో అనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. త‌న‌ను రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాల‌నే ఉత్సాహంతో ఉంద‌ని, అయితే ఏదీ చిక్క‌లేద‌ని ఇటీవ‌ల కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు.

ఈ నేప‌థ్యంలో త‌న క్వాష్ పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేయ‌డంతో, దాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆయ‌న ఆశ్ర‌యించారు. అయితే రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం, ఏసీబీ సుప్రీంకోర్టులో త‌మ వాద‌నలు కూడా వినాల‌ని కేవియ‌ట్ వేశాయి. ఇవాళ కేటీఆర్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

స‌ర్వోన్న‌త న్యాయ స్థానంలో కేటీఆర్‌కు ఉప‌శ‌మ‌నం దొర‌క్క‌పోతే, అరెస్ట్ త‌ప్ప‌క పోవ‌చ్చ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. కేటీఆర్ కోరుకున్న‌ట్టు కేసును కొట్టి వేయ‌క‌పోయినా, అరెస్ట్ నుంచి మిన‌హాయింపు ద‌క్కొచ్చ‌ని బీఆర్ఎస్ శ్రేణులు ఆశావ‌హ దృక్ప‌ధంతో ఉన్నాయి. ఇదేం పెద్ద కేసు కాద‌ని బీఆర్ఎస్ నాయ‌కులు అంటున్నారు.

కేవ‌లం కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకే రేవంత్‌రెడ్డి స‌ర్కార్ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ స‌ర్కార్ అరెస్ట్ చేయ‌డాన్ని మ‌రిచిపోవ‌ద్దు. కేటీఆర్ క్వాష్ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు తీర్పు కోసం జ‌నం ఎదురు చూస్తున్నారు.

4 Replies to “కేటీఆర్ కేసుపై ఉత్కంఠ‌”

  1. “గ‌తంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ స‌ర్కార్ అరెస్ట్ చేయ‌డాన్ని మ‌రిచిపోవ‌ద్దు.” — piccha lambdike.. deniki deniki compare chstunna ra lavadagaa

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.