మెగాస్టార్ చిరంజీవి స్టయిల్ వేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టయిల్ వేరు. చూడాలని వుంది రైల్వే స్టేషన్ సీన్ చిరు స్పెషల్. ఖుషీ లో బొడ్డు సీన్ పవన్ స్పెషల్. కానీ ఈ సీన్ ఆయన చేస్తే..?
భోళాశంకర్ సినిమాలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమిక-పవన్ ల బొడ్డు సీన్ ను చిరు-శ్రీముఖిల మీద రీమిక్స్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
నువ్వు నా బొడ్డు చూసావ్ అని శ్రీముఖి…అసలు అక్కడ బొడ్డు ఎక్కడుంది అన్నీ ముడతలేగా అని మెగాస్టార్ ఫన్నీగా మాట్లాడుకునే సీన్ ఒకటి ప్లాన్ చేసారట.
వేదాళం సినిమా రీమేక్ గా తయారవుతున్న ఈ సినిమాను ఫుల్ ఫన్ తో తయారు చేయాలని చిరు స్వయంగా అన్నీ చూసుకుంటున్నారు. చేసుకుంటున్నారు. అందులో ఈ సీన్ ఒకటి అని టాక్.