‘2018’ విడుదల చేస్తున్న బన్నీ వాస్

2018 కేరళ వరదల నేపథ్యంలో అల్లుకున్న కథతో తయారైన సినిమా 2018. గత నెలలో మలయాళంలో విడుదలై సంచలనాలు నమోదు చేసిందీ సినిమా. వంద కోట్లకు పైగా వసూలు చేసిందని వార్తలు వినిపించాయి. ఈ…

2018 కేరళ వరదల నేపథ్యంలో అల్లుకున్న కథతో తయారైన సినిమా 2018. గత నెలలో మలయాళంలో విడుదలై సంచలనాలు నమోదు చేసిందీ సినిమా. వంద కోట్లకు పైగా వసూలు చేసిందని వార్తలు వినిపించాయి. ఈ సినిమా ఆల్ రెడీ ఓటిటిలోకి వచ్చింది. చూసిన వాళ్లు సూపర్ అనడమూ వినిపించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

నిర్మాత బన్నీ వాస్ తొలిసారి తానే స్వంతంగా 2018 సినిమాను తెలుగు నాట విడుదల చేస్తున్నారు. అయితే పెద్దగా గ్యాప్ లేకుండా జస్ట్ వన్ వీక్ టైమ్ లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 26న విడుదలవుతుంది. అంటే సినిమాకు మినిమమ్ ప్రచారానికి కూడా పెద్దగా టైమ్ వుండకపోవచ్చు.

విశేషమేమిటంటే బన్నీవాస్ తనకు అన్ని విధాలా సంబంధాలున్న గీతా లేదా జిఎ2 సంస్థల నుంచి కాకుండా తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను విడుదల చేయడం విశేషం. తెలుగు నాట కూడా సినిమాకు మంచి ఆదరణ వుంటుందని అంచనా వేస్తున్నారు.