చాప్టర్ క్లోజ్ ద‌శ‌లో చంద్ర‌బాబు.. ఆయ‌న తోక ప‌ట్టుకుని ప‌వ‌న్!

మాటెత్తితే త‌న‌ది నాలుగు ద‌శాబ్దాల అనుభం అని చెప్పుకునే తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల ల్లోపు విలువైన ఒక స్కామ్ లో జైలు పాల‌య్యారు.…

మాటెత్తితే త‌న‌ది నాలుగు ద‌శాబ్దాల అనుభం అని చెప్పుకునే తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల ల్లోపు విలువైన ఒక స్కామ్ లో జైలు పాల‌య్యారు. జైలు నుంచి బ‌య‌ట‌కు రాలేక ఆయ‌న విల‌విల్లాడుతున్నారు! చంద్ర‌బాబు అంటే నిప్పు, చంద్ర‌బాబు అంటే చాణుక్యుడు, చంద్ర‌బాబు అంటే అదీ, ఇదీ.. అంటూ గ‌ప్పాలు కొట్టుకున్న వాళ్లు ఇప్పుడు నిశ్చేష్టుల‌వుతున్నారు! 

మొన్న‌టి వ‌ర‌కూ వారు ఆఫ్ట్రాల్ అనుకున్న‌, ఒక్క ఛాన్స్ అనుకున్న జ‌గ‌న్ ఇప్పుడు.. చుక్క‌లు చూపిస్తూ ఉన్నాడు. చంద్ర‌బాబును ఎవ్వ‌రూ ఏం చేయ‌లేరు.. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి, కేసీఆర్, మోడీ.. వీళ్లంతా కూడా చంద్ర‌బాబు చేష్ట‌ల‌ను నిశ్చేష్టులుగా చూశారు త‌ప్ప ఏం చేయ‌లేక‌పోయారు.. అనే అహం ఒక‌టి ప‌చ్చ చొక్కాల్లో కూడా ఒక‌టి ఉండేది. చంద్ర‌బాబును అడ్డం పెట్టుకుని ఆబ‌గా దోచుకున్న వాళ్లు, చంద్ర‌బాబును కేవ‌లం కులం కోణంలోనే వీరాభిమానించే వారు లోలోపల చంద్ర‌బాబు టెక్నిక్స్ తో మురిసిపోయేవారు. ప‌చ్చ‌మీడియా ఆయ‌న తీరుకు చాణ‌క్యం అనే పేరొక‌టి త‌గిలించేది! మ‌రి ఇన్నేళ్ల ఆ భ్ర‌మ‌ల‌న్నీ బ‌ద్ద‌ల‌య్యాయి.

చంద్ర‌బాబు త‌న‌వైన మేనేజ్ మెంట్ టెక్నిక్స్ తో ఇన్నాళ్లు నెగ్గుకు వ‌చ్చాడు, అనుకుంటే చంద్ర‌బాబు చేత ఊచ‌లు లెక్క‌బెట్టించ‌డం పెద్ద క‌ష్టం కాదు అని జ‌గ‌న్ ప్ర‌భుత్వం త నిరూప‌ణ అయ్యింది. వైఎస్ అనుకోలేదు, కేసీఆర్ ఎందుకో వెనుక‌డుగు వేశాడు, మోడీ ఎక్క‌డో మొహ‌మాట‌ప‌డ్డాడు.. అయితే జ‌గ‌న్ మాత్రం చంద్ర‌బాబు మార్కు రాజ‌కీయాలను మ‌రిచిపోలేదు. చూసిన‌న్ని రోజులూ చూశాడు. ఏం పీకుతావ్, మీ నాన్న ఏం పీకాడు.. అనే మాట‌ల‌ను కూడా చిరున‌వ్వుతోనే విన్నాడు. అస‌లైన స‌మ‌యంలో జ‌గ‌న్ త‌నేం చేయ‌గ‌ల‌నో చూపించాడు.

ఎన్నిక‌ల‌కు మ‌రెంతో స‌మ‌యం లేదు. ఇప్ప‌టికీ తెలుగుదేశం పార్టీకి తాడూబొంగ‌రం లేదు! ఎన్నిక‌లు ఇంకో ఆరేడు నెల‌ల్లో ఉన్నా.. ఇప్ప‌టికీ ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు పోటీ చేస్తారు, ఎవ‌రు ఎక్క‌డ నిల‌బ‌డ‌తారు, ఎవ‌రి బాద్య‌త‌లు ఏమిటి.. అనే క్లారిటీ లేదు. స‌రిగ్గా ఇలాంటి అంశాల మీద క‌స‌ర‌త్తు చేయాల్సిన స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు రాజ‌మండ్రి జైల్లో కూర్చోవాల్సి వ‌చ్చింది. కేసులు ఒక‌టి కాదు.. ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి! మ‌రోవైపు చిన‌బాబు లోకేష్ మొన్న‌టి వ‌ర‌కూ స‌వాళ్లు విసిరి, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప‌లాయ‌నం చిత్త‌గించాడ‌నే పేరునూ తెచ్చుకున్నాడు. 

చంద్ర‌బాబు రాజ‌కీయం చ‌ర‌మాంకంలో ఉంది. బ‌హుశా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోతే.. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు క్రియాశీల రాజ‌కీయంలో ఉంటాడ‌నే అభిప్రాయాలు ఎవ‌రికీ లేవు! కేవ‌లం ఇంటికి ప‌రిమితం కావ‌డం లేదా, ఈ కేసుల ప‌నులు చూసుకోవ‌డ‌మే ఆయ‌న‌కు ప‌నిగా మిగ‌ల‌వ‌చ్చు. అంత‌కు మించి చంద్ర‌బాబు చేయ‌గ‌లిగిన‌ది ఏమీ లేదు. ఆయ‌న చివ‌రి ప్ర‌య‌త్నం అల్లా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని ఎలాగోలా నిల‌బెట్టి,. దాన్ని లోకేష్ చేతిలో పెట్టాల‌నేది! దాని కోసం ఎవ‌రి కాళ్లు ప‌ట్టుకోవ‌డానికి అయినా చంద్ర‌బాబు రెడీ అయ్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై త‌న‌ది వ‌న్ సైడ్ ల‌వ్ అంటూ మాట్లాడిన రోజే ఆయ‌న ప‌త‌నావ‌స్థ స్ప‌ష్టం అయ్యింది.

చంద్ర‌బాబుకు దిక్కులేదు, ప‌వ‌న్ కు మార్గం లేదు అన్న‌ట్టుగా ఇద్ద‌రూ ఒక‌ట‌య్యారు. తీరా వీరి పొత్తు ప్ర‌క‌ట‌న‌కు రాజ‌మండ్రి జైలు వేదిక‌య్యింది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే..  చంద్ర‌బాబుకు ఈ కేసులు, జైలు వ్య‌వ‌హారాల‌ను వ‌దిలించుకునే స‌రికి ఎన్నిక‌లు రావొచ్చు. అంత వ‌ర‌కూ చంద్ర‌బాబుకు ఇదే పిత‌లాట‌కం కొన‌సాగితే.. ఆయ‌న పొలిటిక‌ల్ చాప్ట‌ర్ క్లోజ‌య్యే ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టే! మ‌రి అలాంటి చంద్ర‌బాబు నాయుడు తోక ప‌ట్టుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ వేలాడుతున్నాడు. ఇత‌డి ప‌రిస్థితి ఏమ‌వుతుందో!

-హిమ‌