మాటెత్తితే తనది నాలుగు దశాబ్దాల అనుభం అని చెప్పుకునే తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నాలుగు వందల కోట్ల రూపాయల ల్లోపు విలువైన ఒక స్కామ్ లో జైలు పాలయ్యారు. జైలు నుంచి బయటకు రాలేక ఆయన విలవిల్లాడుతున్నారు! చంద్రబాబు అంటే నిప్పు, చంద్రబాబు అంటే చాణుక్యుడు, చంద్రబాబు అంటే అదీ, ఇదీ.. అంటూ గప్పాలు కొట్టుకున్న వాళ్లు ఇప్పుడు నిశ్చేష్టులవుతున్నారు!
మొన్నటి వరకూ వారు ఆఫ్ట్రాల్ అనుకున్న, ఒక్క ఛాన్స్ అనుకున్న జగన్ ఇప్పుడు.. చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. చంద్రబాబును ఎవ్వరూ ఏం చేయలేరు.. వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్, మోడీ.. వీళ్లంతా కూడా చంద్రబాబు చేష్టలను నిశ్చేష్టులుగా చూశారు తప్ప ఏం చేయలేకపోయారు.. అనే అహం ఒకటి పచ్చ చొక్కాల్లో కూడా ఒకటి ఉండేది. చంద్రబాబును అడ్డం పెట్టుకుని ఆబగా దోచుకున్న వాళ్లు, చంద్రబాబును కేవలం కులం కోణంలోనే వీరాభిమానించే వారు లోలోపల చంద్రబాబు టెక్నిక్స్ తో మురిసిపోయేవారు. పచ్చమీడియా ఆయన తీరుకు చాణక్యం అనే పేరొకటి తగిలించేది! మరి ఇన్నేళ్ల ఆ భ్రమలన్నీ బద్దలయ్యాయి.
చంద్రబాబు తనవైన మేనేజ్ మెంట్ టెక్నిక్స్ తో ఇన్నాళ్లు నెగ్గుకు వచ్చాడు, అనుకుంటే చంద్రబాబు చేత ఊచలు లెక్కబెట్టించడం పెద్ద కష్టం కాదు అని జగన్ ప్రభుత్వం త నిరూపణ అయ్యింది. వైఎస్ అనుకోలేదు, కేసీఆర్ ఎందుకో వెనుకడుగు వేశాడు, మోడీ ఎక్కడో మొహమాటపడ్డాడు.. అయితే జగన్ మాత్రం చంద్రబాబు మార్కు రాజకీయాలను మరిచిపోలేదు. చూసినన్ని రోజులూ చూశాడు. ఏం పీకుతావ్, మీ నాన్న ఏం పీకాడు.. అనే మాటలను కూడా చిరునవ్వుతోనే విన్నాడు. అసలైన సమయంలో జగన్ తనేం చేయగలనో చూపించాడు.
ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి తాడూబొంగరం లేదు! ఎన్నికలు ఇంకో ఆరేడు నెలల్లో ఉన్నా.. ఇప్పటికీ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు, ఎవరు ఎక్కడ నిలబడతారు, ఎవరి బాద్యతలు ఏమిటి.. అనే క్లారిటీ లేదు. సరిగ్గా ఇలాంటి అంశాల మీద కసరత్తు చేయాల్సిన సమయంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో కూర్చోవాల్సి వచ్చింది. కేసులు ఒకటి కాదు.. ఒకదాని తర్వాత మరోటి! మరోవైపు చినబాబు లోకేష్ మొన్నటి వరకూ సవాళ్లు విసిరి, సమయం వచ్చినప్పుడు పలాయనం చిత్తగించాడనే పేరునూ తెచ్చుకున్నాడు.
చంద్రబాబు రాజకీయం చరమాంకంలో ఉంది. బహుశా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు క్రియాశీల రాజకీయంలో ఉంటాడనే అభిప్రాయాలు ఎవరికీ లేవు! కేవలం ఇంటికి పరిమితం కావడం లేదా, ఈ కేసుల పనులు చూసుకోవడమే ఆయనకు పనిగా మిగలవచ్చు. అంతకు మించి చంద్రబాబు చేయగలిగినది ఏమీ లేదు. ఆయన చివరి ప్రయత్నం అల్లా.. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగోలా నిలబెట్టి,. దాన్ని లోకేష్ చేతిలో పెట్టాలనేది! దాని కోసం ఎవరి కాళ్లు పట్టుకోవడానికి అయినా చంద్రబాబు రెడీ అయ్యారు. పవన్ కల్యాణ్ పై తనది వన్ సైడ్ లవ్ అంటూ మాట్లాడిన రోజే ఆయన పతనావస్థ స్పష్టం అయ్యింది.
చంద్రబాబుకు దిక్కులేదు, పవన్ కు మార్గం లేదు అన్నట్టుగా ఇద్దరూ ఒకటయ్యారు. తీరా వీరి పొత్తు ప్రకటనకు రాజమండ్రి జైలు వేదికయ్యింది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. చంద్రబాబుకు ఈ కేసులు, జైలు వ్యవహారాలను వదిలించుకునే సరికి ఎన్నికలు రావొచ్చు. అంత వరకూ చంద్రబాబుకు ఇదే పితలాటకం కొనసాగితే.. ఆయన పొలిటికల్ చాప్టర్ క్లోజయ్యే దశకు వచ్చినట్టే! మరి అలాంటి చంద్రబాబు నాయుడు తోక పట్టుకుని పవన్ కల్యాణ్ వేలాడుతున్నాడు. ఇతడి పరిస్థితి ఏమవుతుందో!
-హిమ
Chadhalu pattina book inkka yemmi ledhu
Tdp party yeppudo pathanam ipoindhi pavala star valla gelicharu
GA నీకు ఎంత వొళ్ళు బలుపు వుంటే ఇలాంటి పిచ్చి రాతలు రాస్తావు. ఇప్పుడు పరిస్థితి నీకు బాగా అర్థమైంది అనుకుంటా
. ఇలాంటి పిచ్చి రాతలకే జనాలకి వొళ్ళు మండి నీమీద జగన్ మీద తూ అని వుమ్మేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోక పట్టుకొని వేలాడుతున్నాడు అని రాశావు . అలా తోక పట్టుకుని మునిగి పోతున్న చంద్రబాబు నావని వొడ్డుకి లాక్కొచ్చాడు. అది పవన్ అంటే
.
GA నీకు ఎంత కొవ్వు పట్టి వుంటే ఇలాంటి రాతలు రాస్తావు. ఇప్పుడు పరిస్థితి నీకు బాగా అర్థమైంది అనుకుంటా
. ఇలాంటి రాతలకే జనాలకి వొళ్ళు మండి నీమీద జగన్ మీద తూ అని వుమ్మేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోక పట్టుకొని వేలాడుతున్నాడు అని రాశావు . అలా తోక పట్టుకుని మునిగి పోతున్న చంద్రబాబు నావని వొడ్డుకి లాక్కొచ్చాడు. అది పవన్ అంటే
.
Correct బాసు ఒకప్పుడు మీడియా అంటే సమాజ శ్రేయస్సు కోసం ఉండేవి ఇప్పుడు కీడుని కోరి దాంట్లో వీడు సంపాదించే అక్రమారజన్ వలన వీడి పిల్లలకు తగుళ్తుంది.
ఇప్పటి మీడియా వ్యవస్థ అధికారం, డబ్బు కు కాళ్ళుకడిగేది లా తయారయ్యింది.
మూక్యం గా ఈ paper గాడు
ఆ తోక పట్టుకుని వేలాడే155 సీట్లు గెలిచి వై సీ పీ గు.. దింపేశారు
తింగరోడు బాబు ను ఏదో చెద్దాం అనుకున్నాడు..
దాని వల్ల బాబు పవన్ ఒక్కటి అయ్యారు ఎలాగైనా వాడిని ఓడించాలనే కసి తో సీట్ల పంపకాలు కూడా చూసుకోకుండా పోటీ చేసి గెలిచారు..
హిమ గారు. నువ్వు అనుకున్నది నీ దగ్గరే పెట్టుకో. వాళ్లు అనుకున్నది నువ్వు వింటే చెప్పు లేదా నీ పిచ్చ పేపర్లో వ్రాయి. నిజాలు చెప్పలేని పేపర్స్ లో ఉండమాకు.
Irrojulo court case lu yevaru pattinchuko vadam ledhu
Dhanam mulam jagath
When reading this article now , this look so funny and those who were on cloud 9 with his arrest are the ones now counting the bars

yevari chapter close aiyyindi ?
బాణం వదిలిన వాడు..
03మార్చ్ 2025 లో చదువుతున్నాను.. ఎంత నవ్వు వస్తుందో నాకు. ఆర్టికల్ ఎంత funny GA వుందో. విడి ఆర్టికల్స్ అన్ని ఇలానే వుంటాయి
You are correct sir and if you search videos of ABN, Sakshi and TV5 and head lines of Eenadu I mean main pages including Sakshi these are also same.
So, don’t break your head!!!!!
Simple logic just compare what CBN sir promised and Jagan sir promised in last 3 elections you will know clearly!!!!!!
Pavan and naidu vidipovalani…. konni lakshala angles lo try chesav… abbbe… kudarle…
Ippudu ade chesthunnav…. kudaradu
Akkada matter ledhu, both are inefficient. Just wait…
yeah 98 % efficient like 1 1 seats
ఈ వార్త ఇప్పుడు ఎందుకు వార్తలు లేక వార్తలు రాయడం రాక లేఖ జగన్ చేసిన మూర్ఖపు పని ప్రజలు మర్చి పోతున్నారు మళ్ళీ గుర్తు వుంచుకుని
చెంబు, చెంచా పాలనా మీద రైతుల, ఉద్యోగుల, ప్రజల ఆవేదన వింటుంటే శ్రవణానందకరంగా వుంది. అప్పుడేనా ఇంకో 4 ఏళ్ళు వున్నాయి. మంచి నీళ్లు కూడా దొరకవు.
They just want power for them not for people sake.
Joke of the year
ఎన్నికల ముందు ఆర్టికల్ కదరా గా గా? ఇప్పటి కైనా తెలిసిందా రాజశేఖరరెడ్డి కానీ చంద్రశేఖర్ రావ్ గానీ ఎందుకు టచ్ చెయ్యలేదో? ఇప్పటికి ఇంకా తొమ్మిది నెలలే. ఇంకా దాదాపు నాలుగు వసంతాల పైన సమయం ఉంది. ఇప్పటికే జగ్గడి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. ఆడికి ఆల్రెడీ 16 నెలల అనుభవం కూడా ఉంది కదా పాపం. ఈసారి దాని అవసరం లేకుండానే చెమటలు పట్టిస్తారు. మీరు ఎన్ని వేషాలైనా వేసుకోండి ఎంత అబద్దపు ప్రచారాలైనా చేసుకోండి. ఈ సారి మాత్రం “జింతాత్త చితా చితా జింతాత్త తా ” నే. పాపం ఎవ్వరూ చెయ్యలేని సాహసం చేసేశాడు కదా తగిన ప్రతిఫలం ఇవ్వకపోతే ఎలా మరి.
ga సర్ లాంటోళ్లందరూ ఇలాంటి bose dk ఆర్టికల్స్ రాయబట్టే అన్న ఇవన్నీ నమ్మి నేను ఇంత మొనగాన్ని కాబోలు అనుకోని తప్పులు దిద్దుకోకుండా ఎలక్షన్ లకి వెళ్లి సంక నాకి పోయాడు అన్న ఆలోచిస్తే మన ga సర్ లాంటోళ్ళ కుట్ర అర్దమవుతుంది i