పొలిటిక‌ల్ పంచ్‌!

1). పాద‌యాత్ర అంటే పాదాల మీద న‌డిచే యాత్ర‌ Advertisement -చెప్పుల‌తో న‌డిస్తే చెప్పుయాత్ర‌ -బుగ్గ‌న ఢిల్లీకి వెళితే అప్పుయాత్ర‌ 2). అవినీతిప‌రులంతా ఒక్క‌ట‌య్యారు – మోదీ -బీజేపీలో వుండేవాళ్లంతా పు”నీతులు” 3). గాలి…

1). పాద‌యాత్ర అంటే పాదాల మీద న‌డిచే యాత్ర‌

-చెప్పుల‌తో న‌డిస్తే చెప్పుయాత్ర‌

-బుగ్గ‌న ఢిల్లీకి వెళితే అప్పుయాత్ర‌

2). అవినీతిప‌రులంతా ఒక్క‌ట‌య్యారు – మోదీ

-బీజేపీలో వుండేవాళ్లంతా పు”నీతులు”

3). గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి పార్టీ గుర్తు పుట్‌బాల్‌

-జ‌నం “గాల్లో”కి తంతారేమో!

4) రెండో విడ‌త గొర్రెల పంపిణీ – కేసీఆర్‌

– ఎన్నిక‌లు ద‌గ్గ‌రైతే నాయ‌కుల‌కి గొర్రెలు గుర్తుకొస్తాయి

5) టీడీపీ అధికారంలోకి వ‌స్తే ప‌థ‌కాల్లో కోత‌లుండ‌వు

-వీటినే కోత‌లంటారు

6) చంద్ర‌బాబూ జూలు విద‌ల్చండి – కేవీపీ

– బాబులో సింహాన్ని చూస్తున్నారంటే అర్జెంట్‌గా మీరు కంటి అద్దాలు మార్చాల్సిందే

7) న‌న్ను బ‌లి చేసారు – మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

– మేక జ‌న్మ‌హ‌క్కు బ‌లి

8) ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతికి నూరు స‌భ‌లు

– ఎన్టీఆర్‌కి శ‌ఠ‌గోపం పెట్టింది మీరే, శ‌త జ‌యంతి జ‌రుపుతున్న‌ది మీరే

9) పొలిటిక‌ల్‌ ల‌క్కీ నెంబ‌ర్ -23

10) 40 శాతం సీట్లు యువ‌త‌కే – టీడీపీ

-తెలుగు దోపిడీ పార్టీలో యూత్ కూడా ఉన్నారా?

11) దేశంలో ప్ర‌జాస్వామ్యం లేదు -రాహుల్‌

-త‌న దాకా వ‌స్తేనే జ్ఞానోద‌య‌మ‌య్యేది

12) బి అంటే బాబు, జె అంటే జ‌గ‌న్‌, పి అంటే ప‌వ‌న్‌. ఇదే బీజేపీ -తుల‌సిరెడ్డి

-మీ పార్టీకి అర్జెంట్‌గా తుల‌సితీర్థం అవ‌సరం