1). పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర
-చెప్పులతో నడిస్తే చెప్పుయాత్ర
-బుగ్గన ఢిల్లీకి వెళితే అప్పుయాత్ర
2). అవినీతిపరులంతా ఒక్కటయ్యారు – మోదీ
-బీజేపీలో వుండేవాళ్లంతా పు”నీతులు”
3). గాలి జనార్ధన్‌రెడ్డి పార్టీ గుర్తు పుట్‌బాల్
-జనం “గాల్లో”కి తంతారేమో!
4) రెండో విడత గొర్రెల పంపిణీ – కేసీఆర్
– ఎన్నికలు దగ్గరైతే నాయకులకి గొర్రెలు గుర్తుకొస్తాయి
5) టీడీపీ అధికారంలోకి వస్తే పథకాల్లో కోతలుండవు
-వీటినే కోతలంటారు
6) చంద్రబాబూ జూలు విదల్చండి – కేవీపీ
– బాబులో సింహాన్ని చూస్తున్నారంటే అర్జెంట్‌గా మీరు కంటి అద్దాలు మార్చాల్సిందే
7) నన్ను బలి చేసారు – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
– మేక జన్మహక్కు బలి
8) ఎన్టీఆర్ శతజయంతికి నూరు సభలు
– ఎన్టీఆర్‌కి శఠగోపం పెట్టింది మీరే, శత జయంతి జరుపుతున్నది మీరే
9) పొలిటికల్ లక్కీ నెంబర్ -23
10) 40 శాతం సీట్లు యువతకే – టీడీపీ
-తెలుగు దోపిడీ పార్టీలో యూత్ కూడా ఉన్నారా?
11) దేశంలో ప్రజాస్వామ్యం లేదు -రాహుల్
-తన దాకా వస్తేనే జ్ఞానోదయమయ్యేది
12) బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్. ఇదే బీజేపీ -తులసిరెడ్డి
-మీ పార్టీకి అర్జెంట్‌గా తులసితీర్థం అవసరం