టాలీవుడ్-మరో సహజీవనం

టాలీవుడ్ లో ఏం కర్మ..ప్రపంచంలోనే సహజీవన సంస్కృతి పెరుగుతోంది. గతంలో అయితే ఇలాంటి సంబంధాలకు వేరే పిచ్చి పిచ్చి పేర్లు వుండేవి. Advertisement కానీ ఇప్పుడు సింపుల్ గా లివింగ్ టుగెదర్ రిలేషన్ అని…

టాలీవుడ్ లో ఏం కర్మ..ప్రపంచంలోనే సహజీవన సంస్కృతి పెరుగుతోంది. గతంలో అయితే ఇలాంటి సంబంధాలకు వేరే పిచ్చి పిచ్చి పేర్లు వుండేవి.

కానీ ఇప్పుడు సింపుల్ గా లివింగ్ టుగెదర్ రిలేషన్ అని ఓ మాట అనేస్తే చాలు. టాలీవుడ్ లో తెలిసినవి, తెలియని ఇలా చాలా వున్నాయి.

అలాంటి వాటిలో ఓ డైరక్టర్ ఓ హీరోయిన్ లివింగ్ టుగెదర్ వైనం ఒకటంట. ఈ డైరక్టర్ ఓ సినిమా చేసారు. చాలా బాలారిష్టాలు దాటుకుని విడుదలై, బాగానే ఆడింది అనిపించుకుంది.

ఆ సినిమాలోనే నటించిందీ నార్త్ ఇండియన్ అమ్మడు. అప్పటి నుంచి ఇద్దరి నడుమ స్నేహం చిగురించిందట. ఆ స్నేహం సహజీవనమై నేటికీ అలా కొనసాగుతోందని బోగట్టా.

లేటెస్ట్ గా మరో సినిమా చేయబోతున్నారు ఆ డైరక్టర్. అందులో ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు వుంటారని టాక్. అయినా కూడా ఈ అమ్మాయికి మాత్రం చాన్స్ ఇవ్వడం లేదట. అలా అని ఆ అమ్మాయి నటించడం మానేయలేదు.

ఆ మద్య ఓ సినిమా చేసింది, చాలా అందంగా తయారైందీ అమ్మాయి అని కాంప్లిమెంట్ కూడా అందుకుంది. మరి తన సినిమాలో డైరక్టర్ ఎందుకు చాన్స్ ఇవ్వడం లేదో?

బాబు చేస్తే స్వాధీనం, వైసీపీ చేసే విధ్వంసం అట