పవన్ ఇంకా ఎక్కువ మాట్లాడాలి

నువ్వు చదివేసిన, చదివిన పుస్తకాల పేర్లు చెప్పు.. నువ్వేంటో చెబుతా అన్నాడట వెనకటికి ఎవరో. మన మాట, మన భాష, మన సంస్కారం ఇవన్నీ కలిపి మన మీద జనాలకు ఓ అవగాహన కల్పిస్తాయి.…

నువ్వు చదివేసిన, చదివిన పుస్తకాల పేర్లు చెప్పు.. నువ్వేంటో చెబుతా అన్నాడట వెనకటికి ఎవరో. మన మాట, మన భాష, మన సంస్కారం ఇవన్నీ కలిపి మన మీద జనాలకు ఓ అవగాహన కల్పిస్తాయి. చేతిలో ఓ మంచి పుస్తకం పట్టుకుంటారు పవన్ కళ్యాణ్. కానీ నోరు తెరిస్తే మురికి కంపు. 

జగన్ అంటే ఎంతయినా కోపం వుండొచ్చు. ఈర్ష్యా అసూయలు వుండొచ్చు. కానీ మాట్లాడేందుకు ఓ పద్దతి వుంటుంది. జగన్ ఏమీ పవన్ ను తిట్టలేదు. దత్తపుత్రుడు అని వుండొచ్చు. మిగిలిన మంత్రుల మాదిరిగా తిట్ల దండకం అందుకోలేదు.

గత ఎన్నికల ముందు లోకేష్ గురించి, బాబుగారి పార్టీ గురించి పవన్ మాట్లాడిన మాటలు జనం మరిచిపోలేదు. ఈ డిజిటల్ యుగంలో అన్నీ రికార్డ్ నే. పదిలంగా వున్నాయి. అలాంటి లోకేష్ ను కౌగలించుకుంటూ, జగన్ ను మాత్రం ‘నువ్వెంత.. నీ బతుకెంత’ అని పవన్ అనడం అంటే ఏమనుకోవాలి. 

జనం ఈ మాటలు విని ఛీ అని ఊస్తున్నారు. ఈ సంగతి పవన్ కు తెలియకపోవచచ్చు. ఆయన దృష్టికి రాకపోచవ్చు. కానీ దాని ఇంపాక్ట్ వుండకుండా పోదు.

జనాలు ఏమంటున్నారు. పవన్ ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచింది. అతని సంస్కారం బయటపడుతుంది అంటున్నారు. న్యూట్రల్ గా వుండేవారు ఈ మాటలు విని ఇటు మొగ్గే బదులు అటు మొగ్గే ప్రమాదం వుందని తెలుగుదేశం జనాలే భయపడుతున్నారు.

పవన్ కు వున్న సమస్య ఏమిటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఎటో వెళ్లి పోతారు. ఏదేదో మాట్లాడతారు. ఊగిపోతారు. అరుస్తారు..ఏదేదో చేస్తారు. ఇదంతా జనం ఓ ఎంటర్ టైన్ మెంట్ గా చూస్తారు. 

కానీ పదే పదే జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకుని, తానేం చేయగలను, తాను ఎలా చేయగలను అన్నది చెప్పకపోతే, కేవలం దేశం పల్లకీ మోయడం కోసం, ఆ పార్టీకి అధికారం సంపాదించి పెట్టడం కోసమే పని చేస్తున్నారన్న క్లారిటీ జనానికి వస్తుంది.