ఈ అల‌వాట్లున్న వారు అదృష్ట‌వంతులు!

అదృష్టం గురించి మ‌నుషులు త‌ర‌చూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ప్ర‌త్యేకించి ఎదుటివారి విష‌యంలో ఇలాంటి వ్యాఖ్యానం చేయ‌డం మ‌నుషులు త‌ర‌చూ చేసేదే! ఫ‌లానా వాడు అదృష్ట‌వంతుడ‌ని అంటూ ఉంటారు. చ‌దువు విష‌యంలోనో, ఉద్యోగం, పెళ్లి, సంప‌ద…

అదృష్టం గురించి మ‌నుషులు త‌ర‌చూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ప్ర‌త్యేకించి ఎదుటివారి విష‌యంలో ఇలాంటి వ్యాఖ్యానం చేయ‌డం మ‌నుషులు త‌ర‌చూ చేసేదే! ఫ‌లానా వాడు అదృష్ట‌వంతుడ‌ని అంటూ ఉంటారు. చ‌దువు విష‌యంలోనో, ఉద్యోగం, పెళ్లి, సంప‌ద ఇలా ఏ విష‌యంలో ఎవ‌రైనా కాస్త క‌ళ‌గా క‌నిపిస్తే.. వారిని అదృష్ట‌వంతులుగా ప‌రిగ‌ణించ‌డం, అదే విష‌యంలో త‌మ‌కు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే త‌మది దుర‌దృష్టం అంటూ వ్యాఖ్యానించ‌డం జ‌రుగుతూ ఉంటుంది! మ‌రి నిజంగానే అదృష్టం అనేది ఉంటుందా! కొంద‌రికి అన్నీ అలా క‌లిసి వ‌చ్చేస్తాయా? అంటే మాత్రం.. ఎవ్వ‌రూ ఔన‌ని చెప్ప‌లేరు. ఏదైనా మంచి జ‌రిగిన త‌ర్వాత అంతా అదృష్టం గురించి మాట్లాడ‌తారు. అంతే కానీ కేవ‌లం అదృష్టాన్నే న‌మ్ముకుని మాత్రమే బాగుప‌డిన వారు ఉండ‌రు!

అయితే.. నిజంగానే అదృష్టం అంటే, అదృష్టం క‌లిసి వ‌చ్చే అల‌వాట్ల‌ను క‌లిగి ఉండ‌టం! నిజంగానే అదృష్టం అనేది ఉంది. అది కేవ‌లం కొన్ని ర‌కాల అల‌వాట్ల‌ను క‌లిగి ఉన్న వారిని వ‌రిస్తుంది. అదృష్టం అనేది రాసి పెట్టుకుని వ‌చ్చి ఉండ‌రు, అది ముంద‌స్తుగా ఏమీ డిసైడ్ అయిపోయీ ఉండ‌దు! అదృష్టం అంటే కొన్ని ర‌కాల అల‌వాట్ల‌ను క‌లిగి ఉండ‌టం అంతే అని చెప్ప‌వ‌చ్చు! ఈ అల‌వాట్ల ఉంటే అదృష్టం మీ వెంట ఉన్న‌ట్టే.  అవేమిటో ఒక‌సారి ప‌రిశీలిస్తే!

రిస్క్ చేసే త‌త్వం!

అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవ‌డానికి వెనుకాడ‌ని వారే అదృష్ట‌వంతులు! కంఫ‌ర్ట్ జోన్ లో ఉంటూ, వాళ్లూ, వీళ్లూ అదృష్ట‌వంతులు కాబ‌ట్టే వారికి ఆ అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని, త‌మ‌కు అలాంటి అదృష్టం లేద‌నుకుంటూ ఉండ‌టం క‌న్నా.. కంఫ‌ర్ట్ జోన్ ను వ‌దిలి, రిస్క్ తీసుకోవ‌డానికి ఉన్న‌ప్పుడే అదృష్టం అంటూ క‌లిసి వ‌స్తుంది. రిస్క్ చేయ‌కుండా ఏదీ రాక‌పోవ‌చ్చు. మీన‌మేషాల‌ను లెక్క‌వేయ‌డం క‌న్నా.. అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ రిస్క్ చేస్తే అదృష్టం దానంత‌ట అదే మిమ్మ‌ల్ని వ‌రించ‌వచ్చు!

స్టే పాజిటివ్!

లేనిపోని భ‌యాలు పెట్టుకోకుండా, ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన‌డానికి పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉండ‌టం కూడా అదృష్ట‌మే! ఇలాంటి ధోర‌ణి అల‌వాటుగానో, స‌హ‌జ‌మైన‌దిగానో ఉండ‌టానికి మించిన అదృష్టం ఉండ‌క‌పోవ‌చ్చు!

కొత్త‌గా ట్రై చేస్తారు!

ప్ర‌పంచంలో తిరుగులేని సక్సెస్ ల‌ను చ‌వి చూసిన వారిని, ఏదైనా కొత్త‌దాన్ని క‌నుగొన్న వారిని కూడా అదృష్ట‌వంతులు అంటూ ఒకే మాట‌లో వ‌ర్ణిస్తూ ఉంటారు! మ‌రి వారు చేసిందేమిటంటే.. కొత్త‌గా ట్రై చేయ‌డం, ఎక్స్ పెరిమెంట్స్ కు సిద్ధంగా ఉండ‌ట‌మే వారి స‌క్సెస్ ల వెనుక ఉన్న సూత్రం! కొత్త అనుభ‌వాల‌ను చ‌విచూడ‌టానికి , కొత్త‌గా సాధించ‌డానికి వారు స‌దాసిద్ధంగా ఉండ‌ట‌మే సిస‌లైన అదృష్టం!

వాళ్లు హార్డ్ వ‌ర్క‌ర్స్!

మ‌నతో పాటు చ‌దువుకున్న వాళ్లో, మ‌నతో పాటు ఉద్యోగం చేయ‌డం మొద‌లుపెట్టిన వారో ఈ రోజు మ‌నక‌న్నా మెరుగైన స్థితిలో ఉన్నారంటే.. గ్ర‌హించాల్సిన అంశం వారు అదృష్ట‌వంతులు అని కాదు! బాగా కష్ట‌ప‌డ్డార‌ని! ఒక‌రో ఇద్ద‌రో క‌ష్ట‌ప‌డ‌కుండానే ఎదిగేశారంటూ మ‌నం అంటూ ఉంటాం. అయితే.. వారి క‌ష్టాన్ని మ‌నం గుర్తించ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం కూడా ఇందుకు ఒక కార‌ణం! అదృష్ట‌వంతులంటే వారు హ‌ర్డ్ వ‌ర్క‌ర్స్ అయిన‌ట్టే!

వాళ్లు అడాప్ట్ చేసుకుంటారు!

ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోవ‌డం, ప‌రిస్థితులకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం చాలా మందికి ఇది చేత‌కాక‌పోవ‌చ్చు! అయితే అదృష్ట‌వంతులు మాత్రం ఏ ప‌రిస్థితుల‌నైనా ఇట్టే అడాప్ట్ చేసుకోగ‌ల‌రు! అందుకే వారు అదృష్ట‌వంతులు!