వ‌ర్త‌మాన రాజ‌కీయంపై పంచ్‌లు

1.జ‌గ‌న్ కొత్త ప‌థ‌కం – జైల్ భ‌రో Advertisement 2.కొత్త సామెత – బాబొక‌టి త‌ల‌చిన జ‌గ‌నొక‌టి త‌ల‌చును 3.ఢిల్లీ యాత్ర ఫ‌లితం –  లోకేష్‌కి తెలుగు రాదు కానీ ఇంగ్లీష్ వ‌చ్చ‌ని అర్థ‌మైంది 4.టీడీపీ అభిమాని…

1.జ‌గ‌న్ కొత్త ప‌థ‌కం – జైల్ భ‌రో

2.కొత్త సామెత – బాబొక‌టి త‌ల‌చిన జ‌గ‌నొక‌టి త‌ల‌చును

3.ఢిల్లీ యాత్ర ఫ‌లితం –  లోకేష్‌కి తెలుగు రాదు కానీ ఇంగ్లీష్ వ‌చ్చ‌ని అర్థ‌మైంది

4.టీడీపీ అభిమాని ఆవేద‌న – ఇన్ని స్కిల్స్ వున్న బాబు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఇరుక్కోవ‌డమేంటి?

5.ప‌వ‌న్ కొత్త పాట – క‌లిసి వుంటే క‌ల‌దు సుఖం

6.ఆంధ్ర‌జ్యోతికి మ‌రోపేరు – చంద్ర‌జ్యోతి

7.కాలం మ‌న‌ది కాక‌పోతే – తాను క‌ట్టిన జైలులో తాను వుండ‌డం

8.వారు వీర‌వుతారంటే – జ‌గ‌న్ లండ‌న్‌లో వున్న‌పుడు బాబు జైల్‌లో వుండ‌డం

9.జైల్ సెక్యూరిటీ కొత్త ప‌దం – నారా హుషార్‌

10.విధి వింత‌లీల – రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుగా వేడి పుట్టించిన చంద్ర‌బాబుకే వేడినీళ్లు లేక‌పోవ‌డం