పోలీసులకు బై చెప్పిన హయత్ నగర్ కీర్తి

హయత్ నగర్ కీర్తి పేరుతో పాపులర్ అయిన కేసులో అంతా కటకటాల వెనక్కు వెళ్లారు. తల్లిని కిరాతకంగా చంపి, మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకొని, ప్రియుడితో గడిపిన కీర్తిని చంచల్ గూడ జైలుకు…

హయత్ నగర్ కీర్తి పేరుతో పాపులర్ అయిన కేసులో అంతా కటకటాల వెనక్కు వెళ్లారు. తల్లిని కిరాతకంగా చంపి, మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకొని, ప్రియుడితో గడిపిన కీర్తిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

కీర్తి ప్రవర్తన చూసిన పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. తల్లిని చంపానన్న బాధ, అపరాధ భావం ఆమెలో మచ్చుకు కూడా కనిపించడం లేదంటున్నారు. చివరికి జైలులో విడిచిపెట్టినప్పుడు కూడా తమకు ఆమె బై చెప్పిందని, మళ్లీ కలుద్దాం అంటూ కులాసాగా జైల్లోకి వెళ్లిందంటున్నారు పోలీసులు.

అటు హత్య  విషయంలో తల్లికి సహకరించిన శశికుమార్ ను చర్లపల్లికి జైలుకు తరలించారు. శశికి యూటీ నంబర్ కేటాయించిన జైలు అధికారులు, మొదటి రోజు అతడితో జైలు ఆవరణలో గడ్డి పీకించారు. అటు కీర్తి, ఇటు శశికి బెయిల్ రావడం అసంభవం అంటున్నారు అధికారులు. సాక్ష్యాలన్నీ పక్కాగా ఉండడంతో, కోర్టు తీర్పు రావడమే ఆలస్యం అంటున్నారు.

మరోవైపు కేసులో కీలక నిందుతుడు, కీర్తి మొదటి బాయ్ ఫ్రెండ్ బాల్ రెడ్డిపై మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడ్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. జైలుకు తరలించామని కూడా చెబుతున్నారు.

కానీ బాల్ రెడ్డి వచ్చిన విషయాన్ని అటు చంచల్ గూడ, ఇటు చర్లపల్లి జైలు అధికారులు మాత్రం నిర్థారించడం లేదు. కేవలం శశి మాత్రమే వచ్చాడంటున్నారు చంచల్ గూడ జైలు అధికారులు.

దీంతో బాల్ రెడ్డి ఏమయ్యాడనే ప్రశ్న తలెత్తింది. కీర్తిని గర్భవతిని చేయడమే కాకుండా, ఆమెకు బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు బాల్ రెడ్డి. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. కీర్తికి అబార్షన్ చేసిన క్లినిక్ ను కూడా సీజ్ చేసి సీల్ వేశారు అధికారులు.

ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుత ప్రియుడు శశి అంటే తనకు ఇష్టం లేదని, తనకు గర్భం వచ్చేలా చేసిన బాల్ రెడ్డినే వివాహం చేసుకుంటానని కీర్తి ప్రకటించడం. 

ఆంధ్రా రాజకీయం.. ఈవారం స్పెషల్ 'గ్రేట్ ఆంధ్ర' పేపర్