ఈ మధ్య డిఫరెంట్ పబ్లిసిటీతో, కాస్త వైవిధ్యమైన మెటీరియల్ తో ఆకట్టుకున్న చిన్న సినిమా రాజావారు.. రాణీగారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్, మనోజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయడానికి రెడీ అయిన ఈ చిత్రానికి సురేష్ మూవీస్ సురేష్ బాబు అండగా నిలబడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సురేష్ మూవీస్ పైన విడుదల చేస్తారు.
రాజా వారి రాణి గారు చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు. అలనాటి హిట్ అయిన తొలిప్రేమ సినిమా లైన్ ను పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తీసిన చందంగా వుంటుందీ సినిమా అని తెలుస్తోంది. సినిమాలో దాదాపు 99శాతం కొత్త వాళ్లే నటించారు. పీల్ గుడ్ లవ్ స్టోరీ ఫన్ కలిసిన ఈ సినిమాకు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా మంచిగా సెట్ అయింది.