చాన్నాళ్లుగానే పెళ్లి ముచ్చట్లు వినిపిస్తూ ఉంది కాజల్ అగర్వాల్. కొన్నేళ్ల కిందటే కాజల్ చెల్లెలు కూడా పెళ్లి చేసేసుకుంది. హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన కాజల్ చెల్లెలు ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిలైంది. సంతానం కలిగిన తర్వాత ఆమె ఇప్పుడు సినిమా ప్రయత్నాలు చేస్తోందట.
ఆ సంగతలా ఉంటే.. కాజల్ పెళ్లి చేసుకుని సెటిలయ్యే దిశగా సాగుతోందట. ఒక వ్యాపార వేత్తతో కాజల్ కు పెళ్లి కుదిరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల మంచులక్ష్మి ఇంటర్వ్యూలో కూడా కాజల్ అగర్వాల్ పెళ్లి పట్ల సానుకూలంగా స్పందించింది. పెళ్లి చేసుకుని సెటిలయ్యే ఉద్దేశం ఉందని స్పష్టంచేసింది.
ఇదివరకూ పెళ్లి గురించి కాజల్ మాట్లాడుతూ తను సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడం జరగదని చెప్పింది. ఇండస్ట్రీ ఆవలి వ్యక్తినే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టుగా ఆమె వివరించింది. ఈ క్రమంలో ఒక వ్యాపారవేత్తతో కాజల్ పెళ్లి కుదిరినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రస్తుతం భారతీయుడు పార్ట్ టులో నటిస్తోంది కాజల్.