సంక్రాంతికి పెద్ద సినిమాల సమరం ఇప్పటికి అయితే జనవరి 12నే అని ఫిక్స్ అయింది. జనవరి 10న రజనీకాంత్ దర్బార్ సినిమా వుంది. మహేష్-బన్నీ సినిమాలు రెండూ 12నే వస్తే వాళ్ల సంగతి ఏమోకానీ నిర్మాతలకు మాత్రం అంతో ఇంతో నష్టమే. ఓపెనింగ్స్ షేర్ అయిపోతాయి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో హీరోలు వినేలాలేరు. ప్రస్తుతానికి అయితే నిర్మాతలు సైలంట్ గా వున్నారు.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం విడుదల పదిహేను రోజులు వుండగా, మహేష్ బాబుకు నచ్చచెప్పి ఒకరోజు ముందుకు వెళ్లేలా రిక్వెస్ట్ చేసే ఆలోచనలు వున్నట్లు తెలుస్తోంది. వెనక్కు వెళ్లడం అంటే పంతాలు, పట్టింపులు వస్తాయి కానీ ముందుకు అయితేకాదు. అందువల్ల 11న సరిలేరు నీకెవ్వరు విడుదల చేసేలా చూడమని మహేష్ ను రిక్వెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
అలా అయితే మహేష్ సినిమాకు సోలో ఓపెనింగ్స్ వస్తాయి. అప్పుడు 10న దర్బార్, 11న సరిలేరు, 12న అల వైకుంఠపురములో సినిమాలు వరుసగా విడుదలవుతాయి. ఏ సినిమాలో సత్తావుంటే ఆ సినిమా కలెక్షన్లు సాధిస్తుంది.