చంద్రబాబు అహంకారం.. ఫ్రస్ట్రేషన్!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో అనుచితమైన మాటలను కొనసాగిస్తూ ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారం సమయం దగ్గర నుంచి జగన్ విషయంలో చంద్రబాబు నాయుడు మామూలుగా మాట్లాడటం…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో అనుచితమైన మాటలను కొనసాగిస్తూ ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారం సమయం దగ్గర నుంచి జగన్ విషయంలో చంద్రబాబు నాయుడు మామూలుగా మాట్లాడటం లేదు. జగన్ విషయంలో అత్యంత అనుచితమైన పదప్రయోగాలకు కూడా చంద్రబాబు వెనుకాడం లేదు.

బాగా అసహనంతో ఉన్న వ్యక్తులు, ఫ్రస్ట్రేషన్లో పతనావస్థలో ఉన్న వ్యక్తులే అలా మాట్లాడుతూ ఉంటారు. తను అదే తీరున ఉన్నట్టుగా చంద్రబాబు నాయడు వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు మళ్లీ జగన్ మీద అదే రీతిన మాట్లాడారట. ఆయన అనుకూల మీడియా ఇస్తున్న లీకుల ప్రకారం.. జగన్ పై చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.

'జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. ఆ రాయితో అతడు తనను కొట్టుకుంటాడు, మనల్నీ కొడతాడు..' అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టుగా ఆయన అనుకూల పత్రికలు ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడుకే చెల్లుతోంది. ఇందులో చంద్రబాబు నాయుడి ఫ్రస్ట్రేషన్ తో పాటు.. ఆయన అహకారపు ధోరణి కూడా అగుపిస్తోందని విశ్లేషకులు అంటూ ఉన్నారు.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే లక్షల కొద్దీ ఉద్యోగాలను ఇచ్చి, నిజాయితీ-పారదర్శకతో కూడిన పాలనే లక్ష్యంగా సాగుతున్న జగన్ పట్ల చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడటం.. ఆయన నైజాన్ని కూడా చాటుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నాలుగు నెలలకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఇంకా నాలుగేళ్లకు పైగా వేచి చూడాల్సిన నేపథ్యంలో ఇంకా ఏమేం మాట్లాడతారో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్‌ లవ్‌