విశాల్ పెళ్లి ఆగిపోలేదట!

తన తనయుడు విశాల్ పెళ్లి ఆగిపోలేదని ప్రకటించాడు నిర్మాత జీకే రెడ్డి. హైదరాబాద్ కు చెందిన అనీశాతో విశాల్ కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా…

తన తనయుడు విశాల్ పెళ్లి ఆగిపోలేదని ప్రకటించాడు నిర్మాత జీకే రెడ్డి. హైదరాబాద్ కు చెందిన అనీశాతో విశాల్ కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా నటించిన అనీశాతో విశాల్ కు మార్చిలో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లి ముహూర్తాలేవీ ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ఆగిపోయిందనే రూమర్ ఒకటి నడుస్తూ ఉంది. ఆ రూమర్ విషయంలో విశాల్, అనీశాలు స్పందించలేదు. ఈ నేపథ్యంలో విశాల్ తండ్రి స్పందించారు. తన తనయుడి పెళ్లి ఆగిపోలేదని, అనీశాతోనే విశాల్ పెళ్లి జరుగుతుందని ఆయన ప్రకటించారు. నడిగర్ సంఘం కోసం విశాల్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనంలో అతడి పెళ్లి జరుగుతుందని జీకే రెడ్డి ప్రకటించారు.

అలాడే నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడి అయితే విశాల్ ప్యానలే మళ్లీ విజయం సాధిస్తుందని జీకే రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే పోలింగ్ పూర్తి అయినా.. ఫలితాలు కోర్టు ఆదేశాల నేపథ్యంలో వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో జీకే రెడ్డి , విశాల్ ప్యానల్ విజయం పై విశ్వాసం వ్యక్తం చేశారు.

శరత్ కుమార్, రాధిక ప్యానల్ వాళ్లతో కూడా తమకు ఎలాంటి విబేధాలు లేవని..  వారు తమ కుటుంబ సభ్యుల్లాంటి వారే అని, తన నిర్మాణంలో వారు కూడా నటించారని జీకే రెడ్డి గుర్తు చేశారు.

సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్‌ లవ్‌