ఈ మధ్య విజయ్ దేవరకొండకు కూడా సరైన హిట్ లభించకపోయినా హీరోయిన్లలో అతడి పట్ల క్రేజ్ ఇంకా తగ్గినట్టుగా లేదు. బాలీవుడ్ కలల హీరోయిన్ జాన్వీ కపూర్ తను విజయ్ దేవరకొండతో నటించాలనుకుంటున్నట్టుగా ప్రకటించుకుంది. అలా యంగ్ హీరోయిన్ కు డ్రీమ్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇక మరో సీనియర్ హీరోయిన్ కూడా ఇప్పుడు విజయ్ పై మనసు పారేసుకున్నట్టుంది.
తను మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. విజయ్ దేవరకొండతో నటించాలని ఉందంటోంది రకుల్ ప్రీత్. ప్రస్తుతం ఈ హీరోయిన్ కెరీర్ మందగమనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈమెకు సరైన హిట్స్ లేవు. మన్మధుడు టూ ఫెయిల్యూర్ తో రకుల్ కెరీర్ ఇంకా స్లో అయ్యింది. ఈ నేపథ్యంలో కూడా తను ఫెయిల్యూర్స్ లో ఉన్నట్టుగా రకుల్ ఒప్పుకోవడం లేదు.
కెరీర్ ఆరంభించిన తక్కువ వ్యవధిలోనే తను స్టార్ హీరోయిన్ అయినట్టుగా రకుల్ చెబుతోంది. తనకు అవకాశాలు ఏమీ పూర్తిగా రాకుండా పోలేదని, ఇప్పుడు కూడా చేతిలో సినిమాలున్నాయని అంటోంది. తన కెరీర్ బాగానే సాగుతున్నట్టుగా చెప్పుకుంటోంది.
ఇలాంటి నేపథ్యంలో విజయ్ దేవరకొండతో నటించాలని ఉందంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన డ్రీమ్ హీరో గురించి చెప్పకనే చెప్పింది. మరి రకుల్ కు తన సినిమాల్లో విజయ్ ఏమైనా అవకాశం ఇప్పిస్తాడేమో! ఆమె నోరు తెరిచి అడిగేసింది!