అక్కడ సైరా కథ కంచికి చేరినట్టే!

తెలుగులో సైరా వసూళ్లు బాగున్నాయి. కానీ నార్త్ లో మాత్రం ఇది మొదటి రోజుకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలా ఉత్తరాదిన పడుతూ లేస్తూ సాగిన సైరా ప్రయాణం దాదాపు ముగిసింది. చిరంజీవి నటించిన…

తెలుగులో సైరా వసూళ్లు బాగున్నాయి. కానీ నార్త్ లో మాత్రం ఇది మొదటి రోజుకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలా ఉత్తరాదిన పడుతూ లేస్తూ సాగిన సైరా ప్రయాణం దాదాపు ముగిసింది. చిరంజీవి నటించిన ఈ సినిమాకు ఇక ఎంతమాత్రం వసూళ్లు వచ్చే అవకాశం లేదని బాలీవుడ్ ట్రేడ్ తేల్చిచెప్పేసింది. 10 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయిన నేపథ్యంలో సైరా కథ దాదాపు ముగిసినట్టేనని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ లు.

సాధారణంగా సినిమా బాగుంటే సౌత్ లో 3 వారాలు కూడా ఆడుతుంది. బాహుబలి-2, కేజీఎఫ్ లాంటి సినిమాలు ఏకథాటిగా నెల రోజులు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ బాలీవుడ్ లో పరిస్థితి వేరు. ఎంత పెద్ద సినిమా అయినా అక్కడ 10 రోజులే. ఒక వీకెండ్ దాటితే రెండో వీకెండ్ కు వసూళ్లు అనుమానమే. అలా మరో 4-5 వారాలు దాటితే సినిమా ఏకంగా డిజిటల్ వేదికలపై, టీవీ ఛానెళ్లపైకి వచ్చేస్తుంది. సైరాకు కూడా ఇప్పుడు ఇదే విశ్లేషణ వర్తిస్తుంది.

నిన్నటితో 10 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఉత్తరాదిన దుకాణం సర్దేసింది. ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సైరాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది. కేజీఎఫ్ తో నార్త్ లో భారీగా లాభాలు చూసిన ఈ సంస్థ, సైరాతో మాత్రం భారీగా నష్టాలు చవిచూస్తోంది. విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమాకు ఉత్తరాదిన కేవలం 7 కోట్ల నెట్ మాత్రమే వచ్చింది. మహా అయితే మరో కోటి రూపాయలు రావొచ్చని అంచనా. మొత్తంగా 8 కోట్ల రూపాయల లోపే సైరా కథ ముగిసే ఛాన్స్ ఉంది.

కేజీఎఫ్, సాహో సినిమాల టైపులో ఉత్తరాదిన ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని అంతా భావించారు. కానీ ఆ సినిమాలకు కనెక్ట్ అయినట్టు, సైరాతో యూత్ కనెక్ట్ కాలేకపోయింది. చిరంజీవి సినిమాకు అదే పెద్ద మైనస్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సైరా సినిమా ఉన్నంతలో సేఫ్ వెంచర్ అనిపించుకుంది. మిగతా అన్ని చోట్లా ఇది ఫ్లాపే.

సినిమా రివ్యూ: ఆర్‌డిఎక్స్‌ లవ్‌