రాజకీయాలేమో కానీ, ఇంకో సినిమా షురూ!

రాజకీయాల గురించి రజనీకాంత్ ప్రకటనల పై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మరో రెండేళ్లలోపే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. అప్పటికైనా రజనీకాంత్ పూర్తి స్థాయిలో రాజకీయ సన్నద్ధతను చేస్తారా లేదా అనేది…

రాజకీయాల గురించి రజనీకాంత్ ప్రకటనల పై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మరో రెండేళ్లలోపే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. అప్పటికైనా రజనీకాంత్ పూర్తి స్థాయిలో రాజకీయ సన్నద్ధతను చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ సంగతలా ఉంటే.. మరో సినిమాను అనౌన్స్ చేస్తున్నాడట రజనీకాంత్. ఆ సినిమాకు దర్శకుడు కూడా కుదిరాడని సమాచారం.

సిరుతై శివ దర్శకత్వంలో రజనీకాంత్ తన తదుపరి సినిమాను ప్రకటించనున్నాడట. ఇప్పటికే వరసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు ఈ స్టార్ హీరో. 'పేట' తర్వాత 'దర్బార్' ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతూ ఉంది ఈ సినిమా. ఇంకా అది షూటింగ్ అయినా పూర్తి కాక ముందే.. సిరుతై శివతో డిస్కషన్స్ ను పూర్తి చేశాడట రజనీకాంత్.

ఈ సినిమాకు సంబంధించి రజనీకాంత్ కొన్ని మార్పులు సూచించాడని, అవి కూడా ఓకే అయిపోయాయని.. దర్బార్ షూటింగ్ అలా ముగిసిందో లేదో.. వెంటనే ఆ సినిమా సెట్స్ మీదకు రజనీకాంత్ ఎంటర్ అవుతాడని ప్రచారం జరుగుతూ  ఉంది. 

మరి అసెంబ్లీ ఎన్నికల్లోపు వీలైనంతగా సినిమాలు చేసేయాలని రజనీకాంత్ ఈ సినిమాలకు ఓకే చెబుతూ ఉన్నారా, లేక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తే లేక ఇలా వరసగా సినిమాలను ఓకే చేస్తున్నారా.. అనేది చర్చనీయాంశంగా మారుతోందిప్పుడు!

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!