ఓవర్సీస్ లో సైరా స్థానం ఎక్కడ?

నార్త్ లో ఆల్రెడీ ఫ్లాప్ అయింది. తమిళనాడు, కేరళ నుంచి అత్యల్ప స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. కర్నాటకలో బంపర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా, అక్కడ కూడా ఫ్లాప్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.…

నార్త్ లో ఆల్రెడీ ఫ్లాప్ అయింది. తమిళనాడు, కేరళ నుంచి అత్యల్ప స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. కర్నాటకలో బంపర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా, అక్కడ కూడా ఫ్లాప్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరి ఓవర్సీస్ పరిస్థితేంటి? సైరా అక్కడ బయటపడుతుందా? తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. చెప్పుకోడానికైతే బాగుంది కానీ, పరిస్థితి చూస్తుంటే మాత్రం అంత ఆశాజనకంగా లేదు.

2వ తేదీన సైరా విడుదలైంది. అంటే నిన్నటికి 5 రోజులు పూర్తయ్యాయి. అంటే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడానికి 5 రోజులు పట్టిందన్నమాట. అది కూడా ప్రీమియర్స్ తో కలుపుకొని. ఇప్పుడీ సినిమా 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందా చేరదా అనేది ఆసక్తికరంగా మారింది. దసరా సీజన్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ.. మరో వీకెండ్ పాటు తెలుగు నుంచి పోటీ లేనప్పటికీ ఇది అదనంగా మరో 10 లక్షల డాలర్లు సంపాదించడం కష్టమే.

సైరా సినిమాకు అసలు పరీక్ష ఇవాళ్టి నుంచి మొదలుకాబోతోంది. మరోవైపు వార్ సినిమా ఉండనే ఉంది. సో.. సైరా సినిమా నిలదొక్కుకుంటుందా లేక వసూళ్లు మరింతగా తగ్గుతాయా అనే విషయం ఇవాళ్టి నుంచి మరో 3 రోజుల్లో తేలిపోతుంది. దీనికితోడు కొన్ని అవాంఛనీయ ఘటనల వల్ల టొరంటో, కెనడాలోని కొన్ని మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయడం కూడా ఎదురుదెబ్బగా మారింది.

ఇక ఓవర్సీస్ లో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమా లిస్ట్ ప్రకారం చూస్తే.. సైరా స్థానం చాలా కిందకు ఉంది. ఈ సినిమాల కంటే ముందు నాన్నకు ప్రేమతో, అజ్ఞాతవాసి, ఫిదా, ఎఫ్-2, అరవింద సమేత లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఖైదీ నంబర్ 150 మరో ఎత్తు. సైరా సినిమా, చిరంజీవి 150వ సినిమాను క్రాస్ చేస్తుందా లేదా అనే అనుమానం కూడా చాలామందిలో ఉంది.

సో.. టాప్-10 లిస్ట్ లోకి చేరాలంటే సైరా సినిమా కనీసం మరో 2 వారాలు గట్టిగా ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం. ఇది ఖైదీ నంబర్ 150ను క్రాస్ చేయడం కూడా దాదాపు కష్టమంటోంది ట్రేడ్. సో.. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల లిస్ట్ లోకి చేరకుండానే ఓవర్సీస్ లో సైరా కథ ముగిసేలా ఉంది.

1. బాహుబలి -2 – $ 20,571,695
2. బాహుబలి  –  $ 6,861,819
3. రంగస్థలం  – $ 3,513,450
4. భరత్ అనే నేను  –  $ 3,416,451
5. సాహో  –  $ 3,233,611
6. శ్రీమంతుడు   –   $ 2,883,437
7. మహర్షి   –  $ 2,543,515
8. గీత గోవిందం   – $ 2,465,367
9. అ..ఆ  – $ 2,449,174
10. ఖైదా నంబర్ 150  –  $ 2,447,043
11. అరవింద సమేత  –  $ 2,181,943
12. ఎఫ్2 –   $ 2,134,632
13. సైరా నరసింహారెడ్డి  –  $ 2,082,557
14. ఫిదా   –  $ 2,066,937
15. అజ్ఞాతవాసి   –  $ 2,065,527
16. నాన్నకు ప్రేమతో   – $ 2,022,392

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!