బ్రేక్‌ని వాడేసుకుంటోన్న బన్నీ

కరోనా విపత్తు కారణంగా ‘పుష్ప’ షూటింగ్ డిలే అవడంతో ఆ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవడానికి అల్లు అర్జున్‌కి ఎక్స్‌ట్రా టైమ్ దొరికింది.  Advertisement సుకుమార్ చాలా కాలం నుంచి వెయిటింగ్‌లో వుండడం వల్ల…

కరోనా విపత్తు కారణంగా ‘పుష్ప’ షూటింగ్ డిలే అవడంతో ఆ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవడానికి అల్లు అర్జున్‌కి ఎక్స్‌ట్రా టైమ్ దొరికింది. 

సుకుమార్ చాలా కాలం నుంచి వెయిటింగ్‌లో వుండడం వల్ల ఈ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అవడానికి అల్లు అర్జున్‌కి ఎక్కువ సమయం దొరకలేదు. దాంతో జుట్టు, గడ్డం మాత్రం పెంచేసి ఫోటోషూట్ చేసేసాడు.

అల్లు అర్జున్ స్టయిలిష్ లుక్స్‌కి పూర్తి విభిన్నమయిన పుష్ప లుక్‌కి మంచి స్పందనే వచ్చింది. అయితే ఆ క్యారెక్టర్‌కి మరింత ఐడెంటిటీ ఇవ్వడానికి, లుక్ పరంగా మరిన్ని ప్రత్యేకతలు చూపించడానికి అల్లు అర్జున్‌కి ఈ బ్రేక్‌లో ఛాన్స్ చిక్కింది. అందుకే ఈ టైమ్ అందుకోసం కేటాయిస్తున్నాడట.

ప్రతి క్యారెక్టర్ కోసం హోమ్‌వర్క్ చేసే అల్లు అర్జున్ పుష్పగా గుర్తుండిపోయే విధంగా తన మార్కు టచెస్ ఇస్తున్నాడట. 

ఇకపోతే ఈ చిత్రానికి బాణీలను దేవిశ్రీప్రసాద్ ఓకే చేసేయగా, సుకుమార్ కూడా ఏకబిగిన షూటింగ్ చేయడానికి కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ రెడీ చేసేసి పెట్టుకున్నాడట. షూటింగ్‌కి వెళితే అరు నెలలలో పూర్తి చేసేలా పుష్ప టీమ్ సర్వ సన్నద్ధమయి వుందట. 

పవన్ కళ్యాణ్ మనిషే అదో టైప్