బీజేపీని ఓడిస్తారా.. కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్పిడెన్సా?

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని ఓడించి తీరతామని అంటున్నారు శరద్ పవార్. ఆ రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పరిణామాలు ఆసక్తిదాయకంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే పొత్తుల విషయంలో ప్రధాన పార్టీలు ఒక…

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని ఓడించి తీరతామని అంటున్నారు శరద్ పవార్. ఆ రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పరిణామాలు ఆసక్తిదాయకంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే పొత్తుల విషయంలో ప్రధాన పార్టీలు ఒక క్లారిటీకి వస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీ వ్యతిరేక పార్టీలతో చేతులు కలిపి పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయి. బీజేపీ, శివసేనలు పొత్తులపై ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎంఎన్ఎస్ కూడా ఈ సారి కాంగ్రెస్-ఎన్సీపీలతో చేతులు కలిపేలా ఉంది.

ఈ నేపథ్యంలో పవార్ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికలకూ, అసెంబ్లీ ఎన్నికలకూ సంబంధం లేదని అన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజలు వేరే మూడ్ లో ఉన్నారన్నారు. పుల్వామా అటాక్ వల్లనే బీజేపీ మహారాష్ట్రలో నెగ్గిందన్నారు. ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రజలు అసహనంతో ఉన్నారని.. సాగనంపడానికి రెడీగా ఉన్నారని పవార్ అంటున్నారు. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే.. మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేకత గట్టిగానే ఉండాలి. 

లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ రైతుల ఉద్యమం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఆ వ్యతిరేకతకు అక్కడ బీజేపీ చిత్తు అయిపో్తుందని అంతా అనుకున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జాతీయవాద భావోద్వేగాలను బీజేపీ రెచ్చగొట్టలేదని.. ఆ పార్టీకి ఓటమి తథ్యమని పవార్ అంటున్నారు. బీజేపీని ఓడించడం ఖాయమని అంటున్న శరద్ పవార్ ది కాన్పిడెన్సో, ఓవర్ కాన్ఫిడెన్సో!

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి