ఆయనొ పెద్ద డైరక్టర్..ఓ పెద్ద హీరోతో సినిమా ప్లానింగ్ లో వుంది. అయితే ఇంకా కథ తయారు కావాలి. సినిమా సెట్ మీదకు వెళ్లాలి. అదంతా చాలా ప్రాసెస్.
ఈలోగా హీరోను వీలయినంత పాంపర్ చేస్తూనే వున్నారు. అందులో భాగంగానే ఆ మధ్య హీరోగారికి ఫోన్ చేసారు. ఎందుకూ? ఆ టైమ్ లో హీరో ఔట్ డోర్ షూట్ లో వున్నారు కనుక.
ఫోన్ చేసి, తానూ వస్తా, ఎలాగూ ఖాళీగా వున్నా..కాస్త కబుర్లు చెప్పుకోవచ్చు అన్నారట. దానికి హీరో మొహమాటం లేకుండా ఇప్పుడు ఎందుకు లెండి అనేసారట. అయినా ఈ డైరక్టర్ ఊరుకోలేదు. కలిసి ఓ దగ్గర వుంటే, మ్యూజిక్ డైరక్టర్ ను కూడా తీసుకెళ్లే కొన్ని ట్యూన్ లు చేసేయవచ్చు అన్నారట.
అయినా ఆ హీరో తగ్గకుండా, అసలు కథ ముందు కానీయండి. ట్యూన్ ల సంగతి తరువాత చూద్దాం. కథ అయిన తరువాత కదా ఇవన్నీ అని ఫోన్ పెట్టేసారని బోగట్టా. మొత్తం మీద హీరో పక్కన కొన్ని రోజులు వుండి పాంపర్ చేయవచ్చు అనుకుంటే ఆ ఐడియా బెడిసి కొటేసింది.