డైరక్టర్ ను రావద్దన్న హీరో?

ఆయనొ పెద్ద డైరక్టర్..ఓ పెద్ద హీరోతో సినిమా ప్లానింగ్ లో వుంది. అయితే ఇంకా కథ తయారు కావాలి. సినిమా సెట్  మీదకు వెళ్లాలి. అదంతా చాలా ప్రాసెస్.  Advertisement ఈలోగా హీరోను వీలయినంత…

ఆయనొ పెద్ద డైరక్టర్..ఓ పెద్ద హీరోతో సినిమా ప్లానింగ్ లో వుంది. అయితే ఇంకా కథ తయారు కావాలి. సినిమా సెట్  మీదకు వెళ్లాలి. అదంతా చాలా ప్రాసెస్. 

ఈలోగా హీరోను వీలయినంత పాంపర్ చేస్తూనే వున్నారు. అందులో భాగంగానే ఆ మధ్య హీరోగారికి ఫోన్ చేసారు. ఎందుకూ? ఆ టైమ్ లో హీరో ఔట్ డోర్ షూట్ లో వున్నారు కనుక. 

ఫోన్ చేసి, తానూ వస్తా, ఎలాగూ ఖాళీగా వున్నా..కాస్త కబుర్లు చెప్పుకోవచ్చు అన్నారట. దానికి హీరో మొహమాటం లేకుండా ఇప్పుడు ఎందుకు లెండి అనేసారట. అయినా ఈ డైరక్టర్ ఊరుకోలేదు. కలిసి ఓ దగ్గర వుంటే, మ్యూజిక్ డైరక్టర్ ను కూడా తీసుకెళ్లే కొన్ని ట్యూన్ లు చేసేయవచ్చు అన్నారట. 

అయినా ఆ హీరో తగ్గకుండా, అసలు కథ ముందు కానీయండి. ట్యూన్ ల సంగతి తరువాత చూద్దాం. కథ అయిన తరువాత కదా ఇవన్నీ అని ఫోన్ పెట్టేసారని బోగట్టా. మొత్తం మీద హీరో పక్కన కొన్ని రోజులు వుండి పాంపర్ చేయవచ్చు అనుకుంటే ఆ ఐడియా బెడిసి కొటేసింది.