రామోజీ పరిస్థితి విషమం.. నిజమెంత?

మీడియా టైకూన్ రామోజీరావు పరిస్థితి విషమంగా ఉందట. ఆయనను ఐసీయూలో చేర్పించారట. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారట. విదేశాల్లో వైద్యానికి ఆయన నిరాకరిస్తున్నారట. కొన్ని గంటలుగా రామోజీరావుపై వినిపిస్తున్న పుకార్లు ఇవి. మరి ఈ…

మీడియా టైకూన్ రామోజీరావు పరిస్థితి విషమంగా ఉందట. ఆయనను ఐసీయూలో చేర్పించారట. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారట. విదేశాల్లో వైద్యానికి ఆయన నిరాకరిస్తున్నారట. కొన్ని గంటలుగా రామోజీరావుపై వినిపిస్తున్న పుకార్లు ఇవి. మరి ఈ మేటర్ లో నిజమెంత? 82 ఏళ్ల రామోజీరావు నిజంగానే అస్వస్తతకు గురయ్యారా? తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ లో ఎలాంటి నిజం లేదంటున్నాయి రామోజీ ఫిలింసిటీ వర్గాలు. పైగా రామోజీ ఫిలింసిటీలోనే ప్రత్యేకంగా ఐసీయూ ఏర్పాటుచేసి మరీ చికిత్స అందిస్తున్నారంటూ వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నారు. ప్రస్తుతం రామోజీరావు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, సంస్థ కార్యకలాపాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు.

రామోజీ గ్రూప్ లో ఉన్న కంపెనీల వ్యవహారాలన్నింటినీ ఇప్పటికీ రామోజీరావే చూసుకుంటున్నారు. పెద్దకొడుకు కిరణ్, కోడలు శైలజ వ్యాపారవ్యవహారాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ.. పర్యవేక్షణ మాత్రం రామోజీరావుదే. కీలక వ్యవహారాల్లో నిర్ణయాధికారం కూడా అతనిదే. గ్రూపులో ఏకస్వామ్యం నడుస్తున్న ఈ సమయంలో రామోజీరావు ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లు చాలామందిని కలవరపాటుకు గురిచేశాయి.

ఫేస్ బుక్, వాట్సాప్ లో కొన్ని గంటలుగా వైరల్ అవుతూ తిరుగుతున్న ఈ పోస్ట్ ను రామోజీరావు వర్గీయులు ఖండిస్తున్నారు. దాన్ని ఫేక్ పోస్ట్ గా చెబుతున్నారు. అయితే ఇదే ఖండన అధికారికంగా జరిగితే బాగుండేది. రామోజీ గ్రూప్ నుంచి అలాంటి స్పష్టత ఏదీ రాకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. సొంత మీడియా ద్వారా రామోజీ గ్రూప్ కు చెందిన వ్యక్తులు దీనిపై ప్రకటన ఇస్తే బాగుంటుంది.

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి