ఎన్నాళ్ళో వేచిన ఉదయం

సాధారణంగా హీరోయిన్లకి గుడ్‌ లుక్స్‌ వుంటే అవకాశాలు వచ్చేస్తుంటాయి. ఎక్కడో ఒక ఇరవై శాతం మందికి మాత్రమే నటించగల సామర్ధ్యం వుంటుంది. నటిగా తానేంటనేది తొలినాళ్ళలోనే నిరూపించుకున్న రెజీనాకి ఇంతకాలం అదృష్టం కలిసి రాలేదు.…

సాధారణంగా హీరోయిన్లకి గుడ్‌ లుక్స్‌ వుంటే అవకాశాలు వచ్చేస్తుంటాయి. ఎక్కడో ఒక ఇరవై శాతం మందికి మాత్రమే నటించగల సామర్ధ్యం వుంటుంది. నటిగా తానేంటనేది తొలినాళ్ళలోనే నిరూపించుకున్న రెజీనాకి ఇంతకాలం అదృష్టం కలిసి రాలేదు. ఆమె వుంటే సినిమా ఫ్లాపే అన్నట్టుగా వరుసగా ఎన్నో ఫ్లాప్‌ సినిమాలలో నటించింది. చిన్న సినిమాలతో మొదలు పెట్టి అగ్ర హీరోల సరసన నటిస్తుందనుకున్న రెజీనా అలాగే చిన్న సినిమాలకి పరిమితం అయిపోయింది.

'ఎవరు'లో ఆమె లీడ్‌ రోల్‌ చేస్తోందంటే కూడా 'ఫ్లాప్‌ కళ' కనిపిస్తోందనే కామెంట్స్‌ పడ్డాయి. కానీ ఇంతకాలం ఓపికగా ఎదురు చూసినందుకు, ప్రతి సినిమాలోను తన వంతు కష్టపడినందుకు రెజీనాకి ఎట్టకేలకు సక్సెస్‌ దక్కింది. ఎవరు తొలి వారంలోనే దాదాపు పెట్టుబడిని రాబట్టుకుని విజయపథంలో దూసుకుపోతోంది. అడివి శేష్‌కి క్షణం, గూఢచారి తర్వాత ఎవరుతో మరో విజయం దక్కగా, రెజీనాకి ఎవరు పెద్ద రిలీఫ్‌ ఇచ్చింది.

ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక రెండు తమిళ చిత్రాలు మినహా మరే అవకాశాలు లేవు. ఈ సక్సెస్‌తో అయినా రెజీనాని గుర్తించి మళ్లీ ఆమెకి మునుపటిలా అవకాశాలు ఇస్తారేమో చూడాలి. హీరోయిన్ల కొరత తీవ్రంగా వున్న ఈ టైమ్‌లో సక్సెస్‌ సాధించడం ఆమెకి కలిసి రావాలి మరి. 

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి