గడచిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైయస్ జగనమోహనరెడ్డి గారి మొట్టమొదటి అమెరికా పర్యటన ఖరారు అయ్యింది.
వచ్చేనెల ఆగష్టు 16 నుండి 22 వరకూ సీఎం గారు వ్యక్తిగతంగా అమెరికాలో పర్యటించబోతున్నారు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ ప్రవాసాంధ్రులు కోరిక మేరకు ఆగష్టు 17 న డల్లాస్ మహానగరంలో అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.
ఈ విషయమై ప్రవాసాంధ్రులు, తమ ప్రియతమ నాయకుడు వస్తునారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంభందించి ప్రవాసాంధ్రులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహుకులు మాట్లాడుతూ డల్లాస్ మహానగరంలోని ' డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ ' సీఎం మీటింగ్ కోసం బుక్ చేయటం జరిగిందని, అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానిస్తున్నామని అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుండీ తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశమున్నదని తెలిపారు.
ఎన్నికలలో ప్రజలందరి మన్ననలు పొంది చిన్న వయస్సులో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రికి తెలుగువారిగా అందరం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, పార్టీలకి అతీతంగా అందరం రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిని కలిసి తమ భావాలని పంచుకోవాలని తద్వారా రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యులు కావాలని నిర్వాహుకులు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రయోజనాల గురించి మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి శ్రీ. Y. S. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతారని నిర్వాహకులు మరియు ప్రవాసాంధ్రులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు అమెరికాకు రావటం మంచి తరుణం అని, ఈ సదావకాశాన్ని వినియొగించు కొవాలని కొరారు.
కార్యక్రమం ఆగష్టు 17న మధ్యాహ్నం 2 గంటలనుండి 7 గంటలు వరకూ జరుగుతుందని, కార్యక్రమానికి అత్యాధిక సంఖ్యలొ వచ్చే అవకాశమున్నందున దానికనుగుణంగా ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
వివిధ రాష్ట్రాల నుండి వచ్చే తెలుగువారు కూడా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి అభ్యర్ధన మేరకు వారిని కలుసుకుటున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యెక అభినందనలు తెలిపారు.