15 నిమిషాల్లో ఓటమిని మరిచిపోయా -పవన్

జనసేన పార్టీ ఘోర పరాజయంపై మరోసారి స్పందించారు పవన్ కల్యాణ్. ఓటమిని తను పూర్తిగా అంగీకరిస్తున్నానని తెలిపారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పవన్, వాషింగ్టన్ లో తెలుగు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు.…

జనసేన పార్టీ ఘోర పరాజయంపై మరోసారి స్పందించారు పవన్ కల్యాణ్. ఓటమిని తను పూర్తిగా అంగీకరిస్తున్నానని తెలిపారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పవన్, వాషింగ్టన్ లో తెలుగు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. తన ఓటమిపై మనసు విప్పి మాట్లాడాలని ఉందంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్.. పరాజయాన్ని మరిచిపోవడానికి తనకు 15 నిమిషాలు పట్టిందన్నారు.

“ఫలితాలు వచ్చిన తర్వాత అపజయం నుంచి కోలుకోవడానికి నాకు జస్ట్ 15 నిమిషాలు పట్టింది. ఓడిపోయానని తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని, ఆ బాధ నుంచి బయటకు రావడానికి నాకు కేవలం పావు గంట మాత్రమే పట్టింది. ఆ 15 నిమిషాలు మాత్రమే నా అపజయాన్ని ఒప్పుకున్నాను. ప్రతిసారి ఓటమి గురించి ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు.”

15 నిమిషాల్లో ఓటమిని మరిచిపోయానన్న పవన్.. తన పార్టీ ఘోర పరాజయానికి కారణాల్ని ఈసారి కూడా వెల్లడించలేదు. కావాలంటే ఇప్పటికిప్పుడు ఎన్నో కారణాల్ని చెప్పగలనని, కానీ మనసులో భయం ఉన్నప్పుడే కారణాలు వెదుక్కుంటామన్నారు.

“ఓడిపోవడానికి నేను ఎన్ని కారణాలు అయినా చెప్పగలను. కానీ చెప్పను. ఎందుకంటే మనసులో భయం ఉంటేనే కారణాలు చెబుతాం. నాకు భయం లేదు. నేను స్కామ్ లు, ద్రోహాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు. నేను మనస్ఫూర్తిగా నమ్మిన మార్గంలో పరాజయం ఎదురైనా నాకు సంతోషమే.”

సక్సెస్ కోసం చాలా బలంగా వెయిట్ చేస్తానంటున్నారు పవన్. తన కెరీర్ నే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకొచ్చారు. ఖుషీ తర్వాత మరో హిట్ కోసం గబ్బర్ సింగ్ వరకు వెయిట్ చేశానని, రాజకీయాల్లో కూడా అలానే వెయిట్ చేస్తానని అన్నారు. తను ఓడిపోతాననే విషయం ఎన్నికలకు ముందే తనకు తెలుసన్నారు.

“నేను ఎక్కడ ఏ సభకు వెళ్లినా లక్షల్లో జనం వచ్చేవారు. అది చూసి నా చుట్టుపక్కల వాళ్లు నేను గెలిచేస్తానని అనుకునేవారు. కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే ఇంతమంది జనాల్ని చూడడం నాకు అలవాటే. నేను ఓడిపోతానని నాకు ఎప్పుడో తెలుసు.”

ఈ సందర్భంగా జనసైనికులకు చురకలు అంటించారు పవన్. గోల చేయడం, అరుపులతో ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దని.. ఆ శక్తిని ఓ మంచి పనికోసం ఖర్చుచేయాలని సూచించారు. తను తానా సభలకు ఎందుకు వెళ్తున్నానో సోషల్ మీడియాలో చర్చ పెట్టేబదులు, మరో మంచి టాపిక్ పై చర్చ నడిపిస్తే బాగుంటుందని చురకలు అంటించారు. 

ముద్దు ముద్దు మాటలతో దొరసాని.. ఏమి చెప్పిందంటే