లావణ్య పెళ్లి డ్రెస్ కు స్పాన్సర్?

సెలబ్రిటీలు ఏం చేసినా ఆదాయమే. నయనతార తన పెళ్లి వీడీయో రైట్స్ భారీ మొత్తానికి విక్రయించిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు మంచి మంచి డ్రెస్ లతో ఫొటోలు దిగడం వెనుక దుస్తుల దుకాణాల నుంచి…

సెలబ్రిటీలు ఏం చేసినా ఆదాయమే. నయనతార తన పెళ్లి వీడీయో రైట్స్ భారీ మొత్తానికి విక్రయించిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు మంచి మంచి డ్రెస్ లతో ఫొటోలు దిగడం వెనుక దుస్తుల దుకాణాల నుంచి వచ్చే ఆదాయాలు దాగి వుంటాయి. ఆ ఫొటోలు ఇన్ స్టాలో లోడ్ చేయడానికి సైతం ఆదాయమే. ఇన్ స్టా అక్కౌంట్ రేంజ్ ను బట్టి ఆదాయం వుంటుంది. 

హీరోయిన్ లావణ్య త్రిపాఠీ పెళ్లి సందర్భంగా ఆమె, మరి కొందరు బంధువులు వేసుకున్న డ్రెస్ ల ఫొటొలు ఇన్ స్టాలో షేర్ చేయడానికి కూడా స్పానర్ షిప్ ఒప్పందం ముందే కుదిరిందని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఓ పెద్ద సంస్థ ముఫై లక్షలో లేదా ఆ పైనో చెల్లించి, అలాగే పెళ్లి కూతురు డ్రెస్ లు ఇచ్చి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆ సంస్థకు ఏం వస్తుంది అంటే, ఆ డ్రెస్ లతో, పెళ్లి వేళ వేసుకున్న రకరకాల పార్టీ వేర్ లతో కూడిన ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేస్తారు. అలాగే వాటిని సంస్థ తన ప్రచారానికి కూడా వాడుకుంటుంది.

ఆ విధంగా సంస్థకు లాభం.. ఇటు సెలబ్రిటీలకు ఆదాయం. ఒకసారి సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుని, ఇన్ స్టాలో ఫాలోవర్లను భారీగా పెంచుకోగలిగితే ఏ మాత్రం శ్రమపడకుండా ఆదాయం దానంతట అదే వెదుక్కుని వస్తుంది.