సెలబ్రిటీలు ఏం చేసినా ఆదాయమే. నయనతార తన పెళ్లి వీడీయో రైట్స్ భారీ మొత్తానికి విక్రయించిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు మంచి మంచి డ్రెస్ లతో ఫొటోలు దిగడం వెనుక దుస్తుల దుకాణాల నుంచి వచ్చే ఆదాయాలు దాగి వుంటాయి. ఆ ఫొటోలు ఇన్ స్టాలో లోడ్ చేయడానికి సైతం ఆదాయమే. ఇన్ స్టా అక్కౌంట్ రేంజ్ ను బట్టి ఆదాయం వుంటుంది.
హీరోయిన్ లావణ్య త్రిపాఠీ పెళ్లి సందర్భంగా ఆమె, మరి కొందరు బంధువులు వేసుకున్న డ్రెస్ ల ఫొటొలు ఇన్ స్టాలో షేర్ చేయడానికి కూడా స్పానర్ షిప్ ఒప్పందం ముందే కుదిరిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ పెద్ద సంస్థ ముఫై లక్షలో లేదా ఆ పైనో చెల్లించి, అలాగే పెళ్లి కూతురు డ్రెస్ లు ఇచ్చి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆ సంస్థకు ఏం వస్తుంది అంటే, ఆ డ్రెస్ లతో, పెళ్లి వేళ వేసుకున్న రకరకాల పార్టీ వేర్ లతో కూడిన ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేస్తారు. అలాగే వాటిని సంస్థ తన ప్రచారానికి కూడా వాడుకుంటుంది.
ఆ విధంగా సంస్థకు లాభం.. ఇటు సెలబ్రిటీలకు ఆదాయం. ఒకసారి సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుని, ఇన్ స్టాలో ఫాలోవర్లను భారీగా పెంచుకోగలిగితే ఏ మాత్రం శ్రమపడకుండా ఆదాయం దానంతట అదే వెదుక్కుని వస్తుంది.