హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్యల పెళ్లి రిసెప్షన్ నిన్నటికి నిన్న జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. కానీ జరిగిన తీరే ఆశ్చర్యంగా వుంది. ఎందుకంటే ఓ హీరో అది కూడా మెగా బ్రదర్ కొడుకు పెళ్లి ఫంక్షన్ అంటే ఎంత హడావుడి వుండాలి. ఏడాది క్రితం ఇదే ఎన్ కన్వెన్షన్ లో హీరో శర్వానంద్ పెళ్లి ఫంక్షన్ జరిగింది.
ఇక్కడ కంపారిజన్ ఎందుకుంటే ఇద్దరూ టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోలే. పైగా వరుణ్ తేజ్ కు మెగా హీరో అన్న ట్యాగ్ కూడా వుంది. శర్వానంద్ ఫంక్షన్ కు ఇండస్ట్రీ సెలబ్రిటీలు, పొలిటికల్ సెలబ్రిటీలు బారులు తీరారు. వరుణ్ ఫంక్షన్ కు చాలా మంది ఇండస్ట్రీ జనాలు మొహం చాటేసారు.
చిన్న చితక అయినా ఫంక్షన్ అంటే చాలు వాలిపోయే వాళ్లు కూడా రాలేదు. మెగా ఫ్యామిలీ నుంచి పవన్ రాలేదు. ఆయన సంగతి తెలిసిందే కనుక ఆశ్చర్యం లేదు. కానీ చాలా మంది దర్శకులు రాకపోవడం చిత్రంగా వుంది. పిలుపు చాలలేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
నాగబాబు ఆయన భార్య కొంత మందిని అయినా స్వయంగా వెళ్లి పిలిచే వుంటారు. కొంత మందికి అయినా ఫోన్ లు చేసే వుంటారు. వాట్సాప్ ల్లో ఇన్విటేషన్ పంపించి వుంటారు. హీరోలు కొంత వరకు వచ్చారు కనుక ఫంక్షన్ కళ కట్టింది. కానీ దర్శకులు చాలా మంది రాకపోవడం అన్నది పాయింట్ అయింది.
మరి ఎందుకిలా అన్నది రాని వాళ్లకే తెలియాలి. ఎందుకు రాలేదు అన్నది పిలిచిన వాళ్లకు కూడా అర్ధమయ్యే అవకాశమూ వుంటుంది.