బాబు నో అన్నది నిజమేనా?

ఉన్నట్లుండి ఓ వార్త. అది కూడా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో. తెలంగాణలో జనసేన పోటీ చేసే చోట్ల మద్దతు తెలియచేయాలని, గెలపు కోసం సహకరించాలని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కోరారని,…

ఉన్నట్లుండి ఓ వార్త. అది కూడా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో. తెలంగాణలో జనసేన పోటీ చేసే చోట్ల మద్దతు తెలియచేయాలని, గెలపు కోసం సహకరించాలని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కోరారని, దానికి చంద్రబాబు నో అన్నారనీ ఆ వార్త సారాశం.

ఇలా ఎందుకు వచ్చి వుంటుంది? నిజం కాదు అని అనుకోవడానికి చాన్స్ తక్కువ. ఎందుకంటే అది వచ్చింది తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ లో. నిజమైతే అది పవన్ కు నామర్దా. ఎందుకంటే అన్ని విధాలా అన్ని మెట్లు దిగి మరీ ఆంధ్రలో చంద్రబాబుకు మద్దతు ఇస్తుంటే తెలంగాణలో ఇవ్వకపోవడం ఏమిటి? మరి నేరుగా చంద్రబాబు ఇలా చెప్పేస్తే పవన్ ఎందుకు ఊరుకున్నారు?

దీని వెనుక మరో అనుమానం కూడా కనిపిస్తోంది. పోటీ చేసినా కూడా జనసేన తెలంగాణలో గెలుస్తుందనే నమ్మకం లేదు, ఆ ప్రభావం ఆంధ్ర మీద పడుతుంది. ఆ సంగతి తెలిసి కూడా భాజపా వత్తిడికి లొంగి పవన్ పోటీకి సై అన్నారు. తెలుగుదేశం తన మద్దతు లేదన్న విషయం ఇలా క్లారిటీగా బయటకు వచ్చేలా చేయకపోతే, రేపు ఆ ఓటమి బరువును తెలుగుదేశం కూడా మోయాల్సి వస్తుంది. 

అందుకే తెలివిగా ఈ ఫీలర్ ను బయటకు వదిలి వుండొచ్చు. తెలుగుదేశం ఇక్కడ తెలివితేటలు ప్రదర్శించి వుండొచ్చు. కానీ ఈ విషయం తెలిసిన తరువాత కూడా జనసేన ఇంకా తల వొంచి, చేతులు కట్టకునే తెలుగుదేశం వెనుకే వుంటుంది అంటే, సమ్ థింగ్.. సమ్ థింగ్ అనుకోవాల్సిందే.