మళ్లీ సన్నబడిన ప్రభాస్

ప్రభాస్ ఎప్పుడు సన్నబడతాడో, ఎప్పుడు లావుగా కనిపిస్తాడో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే, అతడి ఆహారపు అలవాట్లు అలాంటివి. తిండి విషయంలో అస్సలు మొహమాటపడడు ప్రభాస్. తను గట్టిగా తింటాడు. తనతో ఉన్నవాళ్లకు కూడా అదే…

ప్రభాస్ ఎప్పుడు సన్నబడతాడో, ఎప్పుడు లావుగా కనిపిస్తాడో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే, అతడి ఆహారపు అలవాట్లు అలాంటివి. తిండి విషయంలో అస్సలు మొహమాటపడడు ప్రభాస్. తను గట్టిగా తింటాడు. తనతో ఉన్నవాళ్లకు కూడా అదే స్థాయిలో భోజనం పెడతాడు. ఈ అలవాటు వల్ల ఎప్పటికప్పుడు బరువు పెరుగుతుంటాడు ఈ స్టార్.

అలా మొన్నటివరకు కాస్త ఓవర్ వెయిట్ తో కనిపించిన ప్రభాస్, ఉన్నట్టుండి సడెన్ గా బరువు తగ్గాడు. స్లిమ్ గా మారిపోయాడు. కొత్త ఫిజిక్ తో అదరగొట్టాడు.

ముంబయిలోని తన నివాసంలో ఆదిపురుష్ యూనిట్ కు పార్టీ ఇచ్చాడు దర్శకుడు ఓంరౌత్. ఈ పార్టీకి హాజరయ్యాడు ప్రభాస్. పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఈ హీరో, స్లిమ్ ఫిజిక్ తో కనిపించాడు. అసలు ప్రభాస్ ఎప్పుడు ఇంత తగ్గిపోయాడనే అనుమానం వచ్చేంతలా మారిపోయాడు.

4-5 నెలల కిందట సలార్ సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని ఆన్-లొకేషన్ స్టిల్స్ లీక్ అయ్యాయి. వాటిలో ప్రభాస్ కాస్త లావుగా కనిపించాడు. అంతలోనే ఇప్పుడిలా సన్నగా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇలాంటి షాకులిచ్చే హీరోలు టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్ మాత్రమే. ఈ ఇద్దరు హీరోలు ఎప్పటికప్పుడు బరువు పెరుగుతుంటారు. అంతలోనే అమాంతం తగ్గిపోతుంటారు. కొరటాల సినిమా కోసం ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ప్రాజెక్ట్-కె సినిమా కోసం ప్రభాస్ ఇలా అమాంతం బరువు తగ్గాడు.