ప్రభాస్ ఎప్పుడు సన్నబడతాడో, ఎప్పుడు లావుగా కనిపిస్తాడో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే, అతడి ఆహారపు అలవాట్లు అలాంటివి. తిండి విషయంలో అస్సలు మొహమాటపడడు ప్రభాస్. తను గట్టిగా తింటాడు. తనతో ఉన్నవాళ్లకు కూడా అదే స్థాయిలో భోజనం పెడతాడు. ఈ అలవాటు వల్ల ఎప్పటికప్పుడు బరువు పెరుగుతుంటాడు ఈ స్టార్.
అలా మొన్నటివరకు కాస్త ఓవర్ వెయిట్ తో కనిపించిన ప్రభాస్, ఉన్నట్టుండి సడెన్ గా బరువు తగ్గాడు. స్లిమ్ గా మారిపోయాడు. కొత్త ఫిజిక్ తో అదరగొట్టాడు.
ముంబయిలోని తన నివాసంలో ఆదిపురుష్ యూనిట్ కు పార్టీ ఇచ్చాడు దర్శకుడు ఓంరౌత్. ఈ పార్టీకి హాజరయ్యాడు ప్రభాస్. పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఈ హీరో, స్లిమ్ ఫిజిక్ తో కనిపించాడు. అసలు ప్రభాస్ ఎప్పుడు ఇంత తగ్గిపోయాడనే అనుమానం వచ్చేంతలా మారిపోయాడు.
4-5 నెలల కిందట సలార్ సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని ఆన్-లొకేషన్ స్టిల్స్ లీక్ అయ్యాయి. వాటిలో ప్రభాస్ కాస్త లావుగా కనిపించాడు. అంతలోనే ఇప్పుడిలా సన్నగా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇలాంటి షాకులిచ్చే హీరోలు టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్ మాత్రమే. ఈ ఇద్దరు హీరోలు ఎప్పటికప్పుడు బరువు పెరుగుతుంటారు. అంతలోనే అమాంతం తగ్గిపోతుంటారు. కొరటాల సినిమా కోసం ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ప్రాజెక్ట్-కె సినిమా కోసం ప్రభాస్ ఇలా అమాంతం బరువు తగ్గాడు.