ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ రేపే. టోటల్ నందమూరి ఫ్యామిలీ సభ్యులంతా హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎవర్ని పిలచారో? ఎవర్నిపిలవలేదో అన్నది మాత్రం బయటకు తెలియడంలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం గురువారం ఉదయం వరకు పిలుపు అందలేదని తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ కు మాత్రం మూడురోజుల ముందే పిలుపు వచ్చేసింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరి ఆ కోటాలో పిలుపు అందిందో, ఫ్యామిలీ సభ్యుల కోటా కూడా వుందో తెలియదు.
ఈ సాయంత్రానికి పిలుపు వస్తే మాత్రం ఎన్టీఆర్ వెళ్లే ఆలోచనలోనే వున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇప్పటికిప్పుడు పిలుపు అందినా, వెళ్లకుండా వుంటే లేనిపోని సిగ్నల్స్ బయటకు పంపినట్లు అవుతుంది. ఇప్పటికే కూకట్ పల్లి ఎన్నిక కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు పిలుపు అందినా వెళ్లకుండా పరిస్థితి అంత బాగుండకపోవచ్చు.
అందుకే ఎన్టీఆర్ పిలుపు వస్తే వెళదాం. లేకుంటే లేదు అని వేచిచూచే ధోరణిలో వున్నట్లు తెలుస్తోంది.
అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్