శ్రీదేవి మరణం.. ఫైర్ బ్రాండ్ ఆవేదన

శ్రీదేవి చనిపోయిందనే వార్త కంటే ఎలా చనిపోయిందనే ఆరా పైనే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి దీనికి సంబంధించి ఎవరి వద్దా ఎలాంటి సమాచారం లేదు. కానీ అతిగా డైట్ పిల్స్ తీసుకోవడం వల్ల,…

శ్రీదేవి చనిపోయిందనే వార్త కంటే ఎలా చనిపోయిందనే ఆరా పైనే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి దీనికి సంబంధించి ఎవరి వద్దా ఎలాంటి సమాచారం లేదు. కానీ అతిగా డైట్ పిల్స్ తీసుకోవడం వల్ల, కాస్మొటిక్ సర్జరీలు ఎక్కువగా చేయించుకోవడం వల్లనే ఆమె కన్నుమూసిందంటూ వార్తలు వస్తున్నాయి.  

ఆ మధ్య శ్రీదేవి ఒక్కసారిగా సన్నబడ్డారు. సహజసిద్ధంగా బరువు తగ్గితే శరీరాకృతిలో అంత మార్పు రాదు. దీనికి తోడు మళ్లీ బరువు పెరగకూడదనే ఉద్దేశంతో పూర్తిగా ఆహారపు అలవాట్లు మార్చేశారు. ఎక్కువగా విటమిన్ టాబ్లెట్లు వాడుతున్నారనే విషయాన్ని ఆమె డాక్టర్లు కూడా నిర్థారించారు. వీటి వల్ల ఆమెకు సడెన్ గా గుండెపోటు వచ్చి ఉండొచ్చు.

మీడియా ఇదే విషయాన్ని చెబుతూ వచ్చింది. అయితే ఈ రిపోర్టులపై తీవ్రంగా స్పందించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఏక్తాకపూర్. శ్రీదేవికి అత్యంత సన్నిహితంగా ఉండే ఈమె, మీడియాలో వస్తున్న వార్తలపై ఫైర్ అయింది. కాస్మొటిక్ సర్జరీలు, కిడ్నీ ఫెయిల్యూర్, అతిగా టెన్షన్ పడడం వల్ల శ్రీదేవి చనిపోలేదంటోంది ఏక్తా. ఆమెకు గుండెపోటు వచ్చిందనే విషయాన్ని నిర్థారించింది. ఈ రోజుల్లో టీనేజ్ పిల్లలకు కూడా గుండెపోటు వస్తోందని, అలాంటిదే శ్రీదేవికి కూడా వచ్చిందంని అంటోంది. 

మరోవైపు శ్రీదేవి పార్థిక దేహాన్ని ముంబయికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్ లో ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు.. 36గంటల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం డెత్ సర్టిఫికేట్ ను అందించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో ఆమె భౌతిక కాయాన్ని మరికొన్ని గంటల్లో ముంబయికి తీసుకురానున్నారు. టాలీవుడ్ నుంచి వెంకటేష్, నాగార్జున లాంటి ప్రముఖులు ఇప్పటికే ముంబయి చేరుకున్నారు.