డబ్బు కన్నా సెక్స్ తోనే మనిషి ఎక్కువ ఆనందంగా ఉండగలడు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు. అపరిమితంగా డబ్బు కలిగిన వారు ఆనందంగా ఉన్నారా? లేక పార్ట్ నర్ తో సాన్నిహిత్యాన్ని కలిగి, శృంగార జీవితాన్ని ఆస్వాధిస్తున్న వారు ఆనందకరంగా ఉన్నారా? అనే అంశంపై తాము చేపట్టిన పరిశోధనలో .. రెండో కేటగిరి వారే హ్యాపీగా ఉన్నారని తేలిందని వారు పేర్కొన్నారు. అంటే.. డబ్బు కన్నా శృంగారమే జీవితాన్ని ఆనందకరం చేయగలదని వీరు చెప్పారు. ఆన్ లైన్ సర్వే ద్వారా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు వీళ్లు.
అలాగే శృంగారం ఎన్ని సార్లు? అనే అంశంపై కూడా వీరి పరిశోధన సాగింది. ఎన్నిసార్లు అంటే.. ఇన్ని సార్లు అని ప్రమాణాలతో చెప్పలేం కానీ, ఆనందకరమైన దాంపత్య జీవితానికి.. వారానికి ఒకసారి సంభోగం.. సరిపడినంత అవుతుందని అంటున్నారు పరిశోధకులు! ముప్పై వేల మంది శృంగార జీవితాల్లోకి తరచి చూశారట, వాళ్లను అడిగి ఈ పరిశోధన చేశారట.. పెళ్లైన వారు, ధీర్ఘ కాలంగా సహజీవనంలో ఉన్న వారిని అడిగి “వన్స్ ఈజ్ ది మ్యాజిక్ నంబర్..’’ అనే కంక్లూజన్ కు వచ్చారు అధ్యయనకర్తలు. దాంపత్య జీవితం ఆనందకరంగా ఉందటున్న వాళ్లు సగటును వారానికి ఒకసారి కచ్చితంగా కలుస్తున్నారు.. కాబట్టి, వన్స్. .మ్యాజిక్ నంబర్ అవుతుందనేది వీరి థియరీ.
‘ సెక్స్ మీద ఇంకా యాంగ్జైటీతో ఉన్న వారికి.. ఆ అనుభవాన్ని రుచి చూడని వారికి.. వారానికి ఒకసారి చాలు అని చెప్పడం అంత ఉత్సాహాన్ని కలిగించే అంశం కాకపోవచ్చు. పరిశోధన చెబుతున్నది నూతనంగా దాంపత్యంలోకి అడుగుపెట్టిన వారికో… హనీమూన్ లో ఉన్న వారికో కాదు, సగటు మీద పరిశోధన. సంసార బంధంలో శృంగారం పాత్ర పై జరిగిన పరిశోధన ఇది. వివాహం అయ్యాకా కొన్నాళ్లకు. .తమ తమ వృత్తి జీవితాల్లో బిజీ అయిపోతున్న తరుణంలో ఈ మాత్రం తీరిక చేసుకోవాలని సూచించవచ్చు..’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
‘వారానికి ఒకసారి అంటే.. మిగతా ఆరు రోజులూ ఒకరినొకరు స్పర్శించుకోకుండా ఉండాలని చెప్పడం కూడా కాదు. రొమాంటిక్ జర్నీ అంటే ప్రతి సారీ పడకింటి వరకూ వెళ్లడం కాదు.. బెడ్ మీదకు వెళ్లడం కాదు, అంత దూరం వెళ్లకున్నా, అంత కన్నా ప్లజర్ అనుభవించడం అందరికీ అనుభవమే ఉంటుంది. మిగతా సమయంలో అలాంటి అనుభూతులను పొందవచ్చు.. మోర్ సెక్స్, మోర్ హ్యాపీనెస్ అనే థియరీ తప్పు అని చెప్పడమే మా ఉద్దేశం..' అని పరిశోధకులు పేర్కొన్నారు.