పాపిస్తాన్‌కి పక్కలో బల్లెం.!

ఇప్పటిదాకా భారతదేశానికి పాకిస్తాన్‌ పక్కలో బల్లెంలా తయారయ్యింది. ఇప్పుడు పరిస్థితి మారింది. పాపాల పాపిస్తాన్‌కి అక్కడి తీవ్రాదులు, సైన్యమే పక్కలో బల్లెంలా తయారవుతున్నారు. ఏ పీవోకేని చూసుకుని పాకిస్తాన్‌, అక్కడినుంచి ప్రపంచ దేశాలకి తీవ్రవాదాన్ని…

ఇప్పటిదాకా భారతదేశానికి పాకిస్తాన్‌ పక్కలో బల్లెంలా తయారయ్యింది. ఇప్పుడు పరిస్థితి మారింది. పాపాల పాపిస్తాన్‌కి అక్కడి తీవ్రాదులు, సైన్యమే పక్కలో బల్లెంలా తయారవుతున్నారు. ఏ పీవోకేని చూసుకుని పాకిస్తాన్‌, అక్కడినుంచి ప్రపంచ దేశాలకి తీవ్రవాదాన్ని 'ఎక్స్‌పోర్ట్‌' చేస్తోందో, ఆ పీవోకే ఇప్పుడు పాకిస్తాన్‌ మీద తిరగబడ్తోంది. 

పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా, పాకిస్తాన్‌ సైన్యానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్‌ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పీవోకేలో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల భారత సైన్యం, పీవోకేలో తీవ్రవాద శిబిరాలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించిన తర్వాత, పీవోకేలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. నిజానికి, పీవోకేపై భారత్‌ ఎలాంటి పెత్తనం చేసినా, భారత్‌కే అది చేటు తెస్తుందని పాకిస్తాన్‌ భావిస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడక్కడ పరిస్థితి అది కాదు. భారత సర్జికల్‌ స్ట్రైక్స్‌, పీవోకేలో ప్రజలకు కొండంత అండగా నిలిచినట్లే కన్పిస్తోంది. ఆ స్ఫూర్తితోనే, పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. 

నిజానికి, పీవోకే పాకిస్తాన్‌ ఆధీనంలో వున్న బారత భూభాగం. అయినప్పటికీ, అక్కడ రాజకీయ పెత్తనం చాన్నాళ్ళుగా పాకిస్తాన్‌దే. 'మా పెత్తనం ఏమీ లేదు, అక్కడ స్వతంత్ర ప్రభుత్వాలున్నాయి.. మేం తగు సాయం అందిస్తాం అంతే..' అంటూ అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్‌ ఇప్పటిదాకా చెబుతూ వచ్చింది. ఇప్పుడేమో, పరిస్థితులు పాకిస్తాన్‌ని వెక్కిరిస్తున్నాయి. ఈ మార్పుని పాకిస్తాన్‌ కలలో కూడా ఊహించలేదు. అందుకే, పాకిస్తాన్‌ ఒక్కసారిగా చతికిలపడిపోయింది. 

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌గా పిలవబడ్తున్న 'పీవోకే'లో ఇప్పుడు భారత అనుకూల నినాదాలు, పాకిస్తాన్‌ వ్యతిరేక నినాదాలు పెరిగిపోయాయి. అదే సమయంలో బలూచిస్తాన్‌లోనూ పాకిస్తాన్‌ వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఈ రెండు ఆందోళనలూ, పాకిస్తాన్‌లో అంతర్గతంగా కల్లోలానికి తావిస్తున్నాయి. రాజకీయ వైఫల్యం కారణంగానే అటు పీవోకే, ఇటు బలూచిస్తాన్‌ కలిసికట్టుగా పాకిస్తాన్‌పై తిరగబడ్తున్నాయన్నది పాక్‌ ప్రజల వాదన. ఇప్పటిదాకా పాక్‌ ప్రజలకి, భారత్‌ని బూచిగా చూపించిన పాకిస్తాన్‌ పాలకులు, సైన్యం, తీవ్రవాదులు.. ఇప్పుడు పాకిస్తాన్‌ ప్రజల్ని మభ్యపెట్టేందుకు వీలుకాక సతమతమవుతున్నారు. 

మొత్తమ్మీద, పొరుగుదేశం పాకిస్తాన్‌ తాను సృష్టించుకున్న గందరగోళంలో తానే ఇరుక్కుపోయిందన్నమాట. సర్జికల్‌ స్ట్రైక్స్‌తో సగం చచ్చిన పాపాల పాపిస్తాన్‌.. ఇప్పుడీ వివాదాలతో పూర్తిగా చచ్చిపోతుందన్నది నిర్వివాదాంశం.