'కండోమ్' ఈ పేరు మన దేశంలో చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంటుంది. అఫ్కోర్స్.. ఈ మధ్యకాలంలో బాగానే ప్రాచుర్యం పొందుతోందనుకోండి.. అది వేరే విషయం. సెక్స్ – శృంగారం.. అన్న విషయం గురించి గట్టిగా మాట్లాడాలంటే మన దేశంలో చాలామందికి బెరుకు. మన సంస్కృతీ సంప్రదాయాలు అలాంటివి. పాశ్చాత్య సంస్కృతి పుణ్యమా అని ఇక్కడ కూడా విచ్చలవిడి శృంగారం ఎక్కువైపోయింది.
విదేశాల్లో అయితే శృంగారానికి హద్దులే వుండవు. విచ్చలవిడి శృంగారానికి కేరాఫ్ అడ్రస్‌గా చాలా దేశాల గురించి చెప్పుకోవచ్చు. రియోడిజనరోలో జరిగే ఒలింప్ వేడుకల్లో ఇప్పుడు ఈ విచ్చలవిడి శృంగారమే హాట్ టాపిక్. రియోడిజనరో షార్ట్ కట్లో రియో అని వ్యవహరిస్తున్నారు.. ఈ రియో ఒలింపిక్స్‌లో ఏ క్రీడాకారులు పతకాలు సాధిస్తాడు.? ఏ దేశం అత్యధికంగా పతకాల్ని పట్టుకుపోతుంది.? ఈ క్రీడా పండుగలో ఎలాంటి రికార్డులు నమోదవుతాయి.? అన్న అంశాలతోపాటు, రియోలో కండోమ్‌ల వ్యాపారం సృష్టించే రికార్డుల మాటేమిటి.? అన్న చర్చ కూడా గట్టిగానే జరుగుతోంది.
రియోలో కండోమ్‌ల వ్యాపారం చుట్టూనే ఇంత చర్చ జరుగుతోందంటే వ్యభిచార కార్యకలాపాల మాటేమిటి.? ఇక, దాని గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే. రియో వేదికగా ఈసారి చీకటి వ్యాపారానికి హద్దే వుండదన్నది ఓ అంచనా. ఆటగాళ్ళకు రోజూ రెండు కండోమ్‌లు సరఫరా చేస్తారట. ఆ లెక్కన మొత్తం ఆటగాళ్ళ కోసం లక్షల సంఖ్యలో కండోమ్‌లు సిద్ధం చేశారు. ఛీ, ఈ కండోమ్‌ల గోలేంటి.? అనిపిస్తోంది కదూ.! అక్కడంతే. అది చాలా చిన్న విషయం.
206 దేశాలు పాల్గొననున్న రియో ఒలింపిక్స్.. ఈసారి అత్యంత ప్రత్యేకమైనవి. ప్రపంచమంతా ఈ ఒలింపిక్ క్రీడల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు, వారి మద్దతుదారుల సందడిలో రియో తడిసి ముద్దవనుంది. పనిలోపనిగా, రియో ఒలింపిక్స్ అక్కడి 'సెక్స్ బిజినెస్'కి కొత్త ఉత్సాహం తీసుకురానుందట. ఆటల గురించి కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా రియోలో సెక్స్ బిజినెస్ – కండోమ్ వ్యాపారం గురించి చర్చ జరుగుతుండడం జుగుప్సాకరమే అయినా, తప్పదు మరి.. రియో ఒలింపిక్స్ సంబంధించినంతవరకు ఇదే ముఖ్యమైన అంశంగా మారిపోయింది.