2016 ఫస్ట్ హాఫ్ సినిమాలు ఏమిటన్నది తెలిసిపొయింది. ఇక కొన్ని విడుదలై ఎలా వుంటాయో తెలియాలంతే. నాగ్..సోగ్గాడే చిన్ని నాయనా.. ఎన్టీఆర్.. నాన్నకు ప్రేమతో, బాలయ్య.. డిక్టేటర్.., పవన్.. సర్దార్ గబ్బర్ సింగ్.., బన్నీ.. సరైనోడు.., మహేష్ బ్రహ్మోత్సవం.., త్రివిక్రమ్-నితిన్.. అ..ఆ.. ఫస్ట్ హాఫ్ చార్ట్ లో కీలకంగా నిలచాయి.
ఇదే విధమైన క్రేజీ కాంబినేషన్లు సెకండాఫ్ అంతగా వుండేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా మాత్రమే ఇప్పటికి కనిపిస్తోంది. చరణ్ సినిమా ఇప్పుడే ప్రారంభమయింది. అందువల్ల దసరా నాటికి ఫినిష్ అవుతుందా అన్నది అనుమానం. చేయాలంటే చేసేయచ్చు..
నాగ చైతన్య.. ప్రేమమ్, వెంకీ.. బాబు బంగారం.. సాయిధరమ్-సుప్రీమ్ వున్నాయి కానీ, మరీ గొప్ప క్రేజీ కాంబినేషన్లు అయితే కావు.. నాగ్, బాలయ్య, తలా సినిమా ప్రారంభించాలి అంటే టైమ్ పట్టేలాగే వుంది. పవన్-ఎస్ జె సూర్య , మహేష్ –మురగదాస్ ప్రాజెక్టులు ఫైనల్ అయ్యాయి కానీ, పూర్తయ్యే సరికి 2016 వెళ్లిపోతుంది. బన్నీ-విక్రమ్ కుమార్ సినిమా పరిస్థితి అంతే. ప్రభాస్ బాహుబలి సంగతి చెప్పనక్కరే లేదు.. దానికి ఇంకా చాలా టైమ్ వుంది.
సో 2016 ఫస్ట్ హాప్ వున్న రంజుగా సెకండాఫ్ వుంటుందా? అనుమానమే?