ఔనా..నిజమేనా రాజమౌళీ?

ఇప్పుడు రాజమౌళి సినిమాలపై పక్క భాషా జనాలకు కూడా ఆసక్తి పెరిగిపోయింది. దాంతో అక్కడ మీడియా కూడా రాజమౌళి తరువాతి సినిమా మీద ఆసక్తి పెంచేసుకుంది. దీంతో ఎక్కడలేని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అలా ప్రచారంలోకి…

ఇప్పుడు రాజమౌళి సినిమాలపై పక్క భాషా జనాలకు కూడా ఆసక్తి పెరిగిపోయింది. దాంతో అక్కడ మీడియా కూడా రాజమౌళి తరువాతి సినిమా మీద ఆసక్తి పెంచేసుకుంది. దీంతో ఎక్కడలేని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అలా ప్రచారంలోకి వచ్చిందో వార్త.

రాజమౌళి బాహుబలి 2 ప్రాజెక్టు పూర్తయ్యాక, అల్లు అర్జున్-అజిత్ కాంబినేషన్ లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తాడు అన్నది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ టీవీ ఇంటర్వూలో ఈ విషయం చెప్పారట. రియలిస్టిక్ స్టోరీ విత్ ప్యూర్ సోషల్ మెసేజ్ సబ్జెక్ట్ తో ఈ సినిమా వుంటుందట.

నిజంగా ఇది బన్నీ అభిమానులకు శుభవార్తే అవుతుంది. మహేష్, బన్నీ లతో ఇంతవరకు రాజమౌళి సినిమా చేయలేదు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఒక పక్క మహేష్ తో అని వినిపిస్తోంది. మరోపక్క బన్నీ పేరు వస్తోంది. మరి ముందు రాజమౌళి ఎవరి ప్రాజెక్టు మీదకు వెళ్తాడో?