చదువు, సంపాదన వున్న అమ్మాయిలు ఏదోలా బతికెయ్యాలని అనుకోరు. ఏం మేమెందుకు ఎంజాయ్ చెయ్యకూడదు? అంటూ పబ్‌లకూ, డిస్కోలకూ వెళ్ళడం తమ స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తుంటారు. ఇక కోట్లాది రూపాయలు తీసుకునే హీరోయిన్ ఇంకెంత స్వేచ్ఛగా ఆలోచిస్తుందో చెప్పక్కర్లేదు.
హిందీ ముద్దుగుమ్మ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఎంతో ఎనర్జిటిక్‌గా వుంటుంది. మోడ్రన్ అనే పదానికి అచ్చంగా అర్థం చెప్పగల తెగువ ఆమెకు వుంది. మగాళ్ళతో కలిసి మందు కొట్టడం ఆమెకు కాలేజ్ డేస్ నుంచే అలవాటు అంటుంది.
మా ఇంట్లో డిన్నర్ టేబుల్‌పై ఎప్పుడూ వైన్ బాటిల్ వుంటుంది. వింతేముంది.. అని కూడా చెబుతుందావిడ. ఇంట్లో తాగి తందనాలాడితే ఓకే. సెట్‌లో కూడా తాగి అల్లరి చేస్తుంటే ఎలా తల్లీ? అని ఇప్పుడు యూనిట్ వాళ్ళు మొత్తుకుంటున్నారట.
షూటింగ్‌లో కూడా అప్పుడప్పుడూ వైన్ చప్పరించేసి ఆ కిక్‌లో తెగ నటించేస్తుందట. ఇక హీరోలతో అయితే షాట్ గ్యాప్‌లో ఆటలు కూడా ఆడేస్తుందట. తనకు సల్మాన్‌ఖాన్ అంటే చచ్చేంత ఇష్టం అని చెబుతున్న జాక్వెలైన్ ఆయన సలహాలు తీసుకోవడానికి వెనుకాడనంటుంది.
చాలామందికి నేనంటే భయం. ఎందుకంటే సల్మాన్‌ఖాన్ నా వెనుక వున్నాడు కాబట్టి. ఆయన అర్ధరాత్రి కాల్ చేసినా రెస్పాండ్ అవుతానంటుంది జాక్వెలైన్.