కొరటాలశివ – ద్వితీయ విఘ్నం దాటేసాడు

తెలుగు దర్శకుల్లో చాలా మందిని వెంటాడే ద్వితీయ విఘ్నం సెంటి మెంట్ ను కొరటాల శివ దాటేసినట్లే. శ్రీమంతుడు దాదాపు గా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ భయం, సెంటిమెంట్ పక్కకు పోయినట్లే. ఇలా…

తెలుగు దర్శకుల్లో చాలా మందిని వెంటాడే ద్వితీయ విఘ్నం సెంటి మెంట్ ను కొరటాల శివ దాటేసినట్లే. శ్రీమంతుడు దాదాపు గా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ భయం, సెంటిమెంట్ పక్కకు పోయినట్లే. ఇలా సెకండ్ సినిమాను హిట్ చేసుకున్న దర్శకులను టాలీవుడ్ లో వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ జాబితాలో శివ కూడా చేరాడు. 

పైగా మిర్చిలో చూపించిన స్టయిల్ ను శ్రీమంతుడులో కూడా కొనసాగించాడు. పాత్రలకు ఓ స్టయిల్, ఫైట్లకు ఓ స్టయిల్ రూపకల్పన చేయడంతో, అసలు దర్శకుడిగా తనకో స్టయిల్ వుందని రుజువు చేసుకున్నట్లయింది. ఇప్పుడు టాలీవుడ్ ఫస్ట్ లైన్ డైరక్టర్ల జాబితాలోకి శివ కూడా చేరిపోయినట్లే.