ఇప్పుడు రాజమౌళి సినిమాలపై పక్క భాషా జనాలకు కూడా ఆసక్తి పెరిగిపోయింది. దాంతో అక్కడ మీడియా కూడా రాజమౌళి తరువాతి సినిమా మీద ఆసక్తి పెంచేసుకుంది. దీంతో ఎక్కడలేని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అలా ప్రచారంలోకి వచ్చిందో వార్త.
రాజమౌళి బాహుబలి 2 ప్రాజెక్టు పూర్తయ్యాక, అల్లు అర్జున్-అజిత్ కాంబినేషన్ లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తాడు అన్నది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ టీవీ ఇంటర్వూలో ఈ విషయం చెప్పారట. రియలిస్టిక్ స్టోరీ విత్ ప్యూర్ సోషల్ మెసేజ్ సబ్జెక్ట్ తో ఈ సినిమా వుంటుందట.
నిజంగా ఇది బన్నీ అభిమానులకు శుభవార్తే అవుతుంది. మహేష్, బన్నీ లతో ఇంతవరకు రాజమౌళి సినిమా చేయలేదు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఒక పక్క మహేష్ తో అని వినిపిస్తోంది. మరోపక్క బన్నీ పేరు వస్తోంది. మరి ముందు రాజమౌళి ఎవరి ప్రాజెక్టు మీదకు వెళ్తాడో?