చౌదరి పవన్ పాచిక పారలేదు

రేయ్ సినిమా కోసం మెగా ఫ్యామిలీని అన్ని విధాలా వాడాలనుకున్నాడు వైవిఎస్ చౌదరి. వాడేసాడు కూడా. అది చాలక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై  పవనిజం అంటూ పాట తయారుచేసి, దాన్ని ప్రత్యేకంగా…

రేయ్ సినిమా కోసం మెగా ఫ్యామిలీని అన్ని విధాలా వాడాలనుకున్నాడు వైవిఎస్ చౌదరి. వాడేసాడు కూడా. అది చాలక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై  పవనిజం అంటూ పాట తయారుచేసి, దాన్ని ప్రత్యేకంగా విడుదల చేసి, నానా హడావుడి చేసాడు. 

సినిమా విడుదల కొన్నాళ్ల తరువాత దాన్ని మిక్స్ చేసి వదిల్తే, పవన్ అభిమానులు అంతా  లగెత్తుకు వచ్చి, సినిమా హిట్ చేస్తారని పెద్ద స్కెచ్ వేసాడు. కానీ అలాంటి వ్యవహారం కనిపించలేదు. 

పైగా ఏ మెగా గ్రూప్ ను అయితే నమ్ముకున్నాడో, అదే గ్రూప్ కు చెందిన సత్యమూర్తి విడుదలయ్యాక, మరి రేయ్ కనిపించకుండా పోయింది. సినిమాలో దమ్ము వుండాలి కానీ ఈ జిమ్మిక్కులన్నీ ఎందుకు?